చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లో బాలయ్యకు ఇష్టమైన హీరో
నందమూరి నటసింహం బాలకృష్ణ డాకూ మహారాజ్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.175 కోట్ల గ్రాస్ రాబట్టింది. థియేటర్లలో ఎక్కువ కాలం ఆడటంద్వారా ఇంకా ఎంత రాబట్టే అవకాశం ఉందనే విషయాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన తండేల్ సినిమా రాబోతోంది. అప్పటివరకు ఎంత కలెక్షన్లు రాబడితే అంత మంచిది. తండేల్ సినిమాకు పర్వాలేదు అనే టాక్ వచ్చినా చాలు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమంటున్నారు. కాబట్టి ఈ పది రోజుల్లో ఎంత కలెక్షన్లు వస్తాయనేది చూడాలి. తన తర్వాత సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.
మైక్ తీసుకొని కరణ్ జోహార్ ను అడిగారు
బాలయ్యను ఇటీవల దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో లెజండరీ అవార్డును ఇచ్చి సత్కరించారు. తన తండ్రి ఎన్టీఆర్ వల్లే ఈ లెజండరీ అవార్డు రావడం సాధ్యమైందని బాలయ్య అన్నారు. బాలకృష్ణతోపాటు చిరంజీవి, వెంకటేష్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్, బాలయ్య మధ్య చిట్ చాట్ జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను కరణ్ బాలయ్యను అడిగారు. ఈ క్రమంలోనే మీ సమకాలికులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అంటే ఎవరు ఇష్టం? మీరు ఎవరి నటనను ఇష్టపడతారు? మీ అభిమాన హీరో ఎవరు అని అడిగారు. దీంతో బాలయ్య వెంటనే డైలామలో పడలేదు. తెలివిగా ఆలోచించి మైక్ తీసుకొని కరణ్ ను కూడా ప్రశ్నించారు.

తెలివిగా వ్యవహరించిన బాలయ్య
హిందీలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు? ఎవరంటే మీరు బాగా ఇష్టపడతారు? మీ అభిమాన హీరో వీరిలో ఎవరు అంటూ కరణ్ ను ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పకుండా కరణ్ జోహార్ పెద్దగా నవ్వేశారు. తనకు ఎదురైన క్లిష్టమైన ప్రశ్నను బాలయ్య చాలా తెలివిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బోయపాటి శ్రీనుతో చేస్తున్న అఖండ2 తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దీని తర్వాత తిరిగి కొల్లి బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు. దీనికి కథను బాబీ ఇప్పుడే సిద్ధం చేయడం ప్రారంభించారు. హిందీలో విడుదలైన డాకూ మహారాజ్ నెమ్మదిగా అక్కడి ప్రేక్షకులకు చేరువవుతోంది.












Click it and Unblock the Notifications