ఎన్టీఆర్ ప్రేమగా మై ఎవ్రీ డే 'లక్షణుడు' అంటూ పిలుస్తున్న చరణ్ ఎవరంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు ఆయన నటించిన 'దేవర' సినిమా జపాన్‌లో 28వ తేదీన విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ కొరటాల శివతో పాటు జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. రీసెంట్ గానే జపాన్ ఫ్యాన్స్‌తో కలిసి ఎన్టీఆర్ స్టెప్పులు వేసిన వీడియో సోషల్‌మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యింది. ఇక మరోవైపు జపాన్ లోనే ఫ్యామిలీ టైమ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు తారక్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులు, స్టోరీలు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి. ఈరోజు ఎన్టీఆర్ సతీమణి ప్రణతి పుట్టిన రోజు. దీంతో జపాన్ లోనే తన భార్య బర్త్ డే వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేశారు తారక్. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం పోస్ట్ చేశాడు. అమ్మలూ.. హ్యాపీ బర్త్‌డే అని విషెస్ చెబుతూ లవ్ సింబర్ యాడ్ చేశాడు. ఆ ఫోటోల్లో తారక్, ప్రణతి ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రణతికి బర్త్ డే విషెస్ చెప్పిన ఎన్టీఆర్.. స్టోరీలో మాత్రం చరణ్ దేవినేనితో జపాన్ లో దిగిన ఫోటోలను షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే తమ్ముడు. మై ఎవ్రీడే లక్ష్మణుడు' అని రాసుకొచ్చారు. దీంతో అసలు ఎవరీ లక్ష్మణుడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా తెగ వెతికేస్తున్నారు.
చరణ్ ఎవరంటే..
హైదరాబాద్ లో టెనెట్ డయాగ్నొస్టిక్ సెంటర్ ఓనర్ చరణ్ దేవినేని అని తెలుస్తోంది. ఎన్టీఆర్ అంటే అతనికి చాలా అభిమానమని.. ఎన్టీఆర్ సన్నిహితులలో చరణ్ కూడా ఒకరని చెబుతున్నారు. ఎన్టీఆర్ ప్రణతి దంపతులతో పాటు చరణ్ దేవినేని కూడా జపాన్‌లో ఉన్నారంటే.. వారి మధ్య ఎంత బాండింగ్ ఉందో అని అంటున్నారు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' మూవీలో నటిస్తున్నారు. ఇది బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే భారీ సెట్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.












Click it and Unblock the Notifications