చిరంజీవికి ఇష్టమైన ఈతరం స్టార్ హీరో ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియనివారు భారతదేశంలోనేకాదు విదేశాల్లో కూడా ఉండరు అంటే అతిశయోక్తి కాదు. స్వయంకృషి అనే పదానికి పర్యాయపదంగా నిలిచారు. క్యారెక్టర్ నటుడుగా, విలన్ గా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తర్వాత హీరోగా మారారు.
అంతేకాదు.. అద్భుతమైన రీతిలో ఆయనే చేసే నృత్యాలకు, ఫైట్లకు దాసోహమవని సినీ అభిమానే ఉండరు. తాను మెగాస్టార్ అవడమే కాకుండా తన కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలను చిత్ర పరిశ్రమకు అందించారు. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువమంది హీరోలు కలిగివున్న ఏకైక కుటుంబం చిరంజీవి కుటుంబమే కావడం గమనార్హం.

ప్రస్తుత వయసులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి తాను యువకుడిగా ఉన్న సమయంలోనే కాకుండా మధ్య వయస్కుడిగా ఉన్న సమయంలోను తనకు సినీ రంగంలో ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో ఇష్టమని చెప్పేవారు.
అయితే ప్రస్తుత తరంలో తనకు ఇష్టమైన స్టార్ హీరో ఒకరు ఉన్నారు. ఆయన అనేక పాత్రలను సులువుగా పోషిస్తారు. ఆయన నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండరు. అందుకే చిరంజీవి కూడా ఆయన నటనకు ఫిదా అయ్యారు. ఆయన ఎవరో కాదు.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.

విలన్ గా, తండ్రిగా, తాతగా.. ఇలా ఎన్నోరకాల పాత్రలను అవలీలగా పోషించిన ప్రకాష్ రాజ్. ఒకప్పుడు రమ్యకృష్ణ పక్కన హీరోగా నటించిన ప్రకాష్ రాజ్ గుంటూరు కారం సినిమాలో ఆమెకు తండ్రిగా నటించి పాత్రను రక్తికట్టించారు. అటువంటి ప్రకాష్ రాజ్ లేకుండా ఒకప్పుడు ఏ తెలుగు హీరో సినిమా ఉండేదికాదు. చిరంజీవితో సహా. ఆయన నటనకు చిరంజీవి దాసోహమయ్యారు. అనేక సందర్భాల్లో తనకు ప్రకాష్ రాజ్ నటన అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టిన ప్రకాష్ రాజ్ చాలా తక్కువగా సినిమాల్లో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications