రామ్ చరణ్ డాక్టరేట్ పై స్పందించని స్టార్ హీరో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రకటించడంపై అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారికి గౌరవార్థం డాక్టరేట్లను ప్రదానం చేస్తారు. చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రకటించింది. వినోద రంగంలో రామ్ చరణ్ చేసిన సేవలకు గుర్తింపుగా వేల్స్ విశ్వవిద్యాలయం తన 14వ వార్షికోత్సవ వేడుకల్లో డాక్టరేట్ ను అందించి సత్కరించింది. దీనిపై అభిమానులంతా సంబరాలు చేసుకుంటుంటే ఓ హీరో మాత్రం సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం.

రామ్ చరణ్ కు డాక్టరేట్ రావడం అతనికి ఇష్టం లేదని, అతనికి డాక్టరేట్ అందుకునేంత సీన్ లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో ఎంతోమంది చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తు ఆ హీరో మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరణ్ తో సన్నిహిత సంబంధాలు లేని హీరోలు ఎవరా? అంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో హీరో పేరు చెబుతూ, అందుకు కారణాలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

who is that hero doesnt like ramcharan doctorate

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. వాస్తవానికి ఇది ఎప్పుడోనే విడుదలు కావాల్సి ఉన్నప్పటికీ భారతీయుడు2 షూటింగ్ లో శంకర్ బిజీగా ఉండటంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు దీన్ని జూన్ లో కానీ, ఆగస్టు 15న కానీ విడుదల చేయాలని నిర్ణయించారు. అదేరోజు పుష్ప2 సినిమా కూడా విడుదల కానుంది. ఒకదాంతో మరొకటి పోటీపడుతూ ఇలా విడుదల చేయడం మంచిది కాదని, శంకర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కొందరు పరిశ్రమ పెద్దలు సూచనలిస్తున్నారు. చివరకు ఏం చేస్తారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+