నిత్యామీనన్‌తో బికినీ వేయించాలనుకున్న దర్శకుడు?
ఏ భాషలో అయినా సినిమా తీసే దర్శకుడికి ఎంతో సృజనాత్మకత ఉండాలి. అది ఉంటేనే ఆ సినిమా బాగా వస్తుంది. అప్పుడు ఆ దర్శకుడిలోని క్వాలిటీ బయటపడి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఏ హీరో పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది? ఏ పాత్రకు ఏ హీరోయిన్ సెట్ అవుతుంది? ఏ సన్నివేశమైన హీరోయిన్ బాగా చేయగలుగుతుంది? ఏ హీరో పక్కనైతే ఫలానా హీరోయిన్ బాగుంటుంది? తదితర విషయాలపై ఒక అంచనాకు రావాలి. అప్పుడే ఆ సినిమా కూడా బాగా వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఒకతను హీరోయిన్ నిత్యామీనన్ ఐటంగర్ల్ అయితే బాగుంటుందనే అవగాహనకు వచ్చాడు.
సాంప్రదాయంగా నిత్యామీనన్
తన సినిమాలో ఒక ఐటం సాంగ్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అయితే నిత్యామీనన్ ఎంతో సాంప్రదాయబద్దమైన పాత్రల్లోనే నటిస్తుంటుంది. ఎక్స్ పోజింగ్ కు సంబంధించి ఎవరైనా డైరెక్టర్ అడిగినా సినిమా చేయకుండా అయినా మానుకుంటుందికానీ అలా మాత్రం చేయదు. ఆ విషయం తెలిసి కూడా ఆ డైరెక్టర్ అడిగాడా? లేదంటే అమాయకంగా అడిగాడా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అలాంటి బ్యూటీని చూడగానే ఐటం సాంగ్ చేయించాలనే ఆలోచన ఏ దర్శకుడికి రాదు. అయితే ఈ డైరెక్టర్ కు అటువంటి ఆలోచన ఎలా వచ్చిందిరా భగవంతుడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తీయడం రాకపోతే ఇంట్లో కూర్చో
నాని కథానాయకుడిగా నటించి అలా మొదలైంది సినిమాద్వారా పరిశ్రమలోకి ప్రవేశించిన నిత్యామీనన్ తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకుంది. తనదైన శైలిలో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సహజ నటిగా పేరు తెచ్చుకుంది. అటువంటి నటిని ఐటం సాంగ్ చేయమంటూ ఆ దర్శకుడు బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు.. ఆమెచేత బికినీ కూడా వేయించాలనుకున్నాడంట. దీనిపై ఆ దర్శకుడిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. నీ క్రియేటివిటీ అంతా ఏమైపోయింది.. ఇదేనా నీ క్రియేటివిటీ.. సినిమాలు తీయడం రాకపోతే ఇంట్లో కూర్చో.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications