తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు శోభన్‌బాబు అందగాడు.. ఇప్పుడు ఎవరో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు అందగాడు ఎవరంటే అందరూ చెప్పే పేరు దివంగత శోభన్ బాబు. మహిళల కల్లోకి రావడమేకాదు.. పురుషులకు కూడా అసూయ పుట్టించే అందం అతని సొంతం. అటువంటి అందగాడు దూరమైన తర్వాత ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో అందగాడు ఎవరు? అంటూ సామాజిక మాధ్యమాలలో నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. తరాలు మారుతున్నప్పటికీ శోభన్ బాబు లాంటి అందగాడు ఉన్నాడా? లేడా? ఉంటే ఎవరు? అని చర్చించుకుంటున్నారు.
మహేష్ బాబే అందగాడు
తెరపై శోభన్ బాబు కనపడితే కన్నార్పకుండా పురుషులు, మహిళలు అందరూ చూసేవారు. అతని తర్వాత మన్మథుడిగా కింగ్ నాగార్జున పేరు తెచ్చుకున్నారు. అమ్మాయి కలల రాకుమారిడిగా నిలవడమేకాదు.. అందరినీ తన అందంతో ఆకట్టుకున్నారు. శోభన్ బాబు, నాగార్జున తర్వాత ప్రస్తుత తరంలో తెలుగు ఇండస్ట్రీ మొత్తంమీద అందగాడు ఎవరు? అనేదానికి అందరూ తమ ఓటును మహేష్ బాబుకు వేస్తున్నారు. నెటిజన్లంతా ముక్తకంఠంతో మహేష్ బాబే అందగాడని చెబుతున్నారు. కామెంట్లు పెడుతున్నారు.

వయసుతోపాటు అందం పెరుగుతోంది
వాస్తవానికి ఏ మనిషికైనా వయసు పెరుగుతుంటే అందం కూడా తగ్గుతుంటుంది. కానీ మహేష్ బాబుకు మాత్రం వయసు పెరిగేకొద్దీ అందం కూడా పెరుగుతోంది. అందం విషయంలో ప్రిన్స్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. తిండి కూడా ఏది పడితే అది తినరు. ఆచితూచి జాగ్రత్తగా తింటారు. అందుకోసం తనకు ఇష్టమైనవి కూడా ఆయన వదులుకుంటారు. ఉప్పు, పంచదారకు ఆయన ఎంతో దూరం. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ వాణిజ్య ప్రకటనలో మహేష్ బాబు నటించారు. అది చూసిన సినీ ప్రియులంతా ఆ యాడ్ లో ప్రిన్స్ అందాన్ని చూసి అమితాశ్చర్యానికి గురయ్యారు. ఇంత గ్లామర్ మహేష్ బాబుకు ఎలా సాధ్యమైంది? అనుకున్నారు. ఏదేమైనప్పటికీ పరిశ్రమ మొత్తం మీద ఏకైక అందగాడిగా ప్రిన్స్ నిలిచారు.












Click it and Unblock the Notifications