బిగ్‌బాస్ 8లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా ఆరంభం అయింది. ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి తగ్గట్టుగానే మొదటి రోజే ట్విస్ట్‌లతో బిగ్‌బాస్ అదరగొట్టారు. సింగిల్‌గా వెళ్లడానికి వీల్లేదని నాగార్జన కంటెస్టెంట్లకు తేల్చి చెప్పారు. మీరు కపుల్స్ లాగే వెళ్లండి.. మీ ఇష్టమొచ్చినట్టు మీరు కథలు నడిపించుకోండంటూ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వాళ్లకి ఇవ్వండని కంటెస్టెంట్లకు నాగార్జునకు తేల్చి చెప్పారు. అలాగే బిగ్‌బాస్ 8వ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే షో సాగుతుందని బిగ్‌బాస్ తేల్చేశారు.
మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఆదివారం హౌస్ లోకి అడుగుపెట్టారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సీరియల్స్ వారే అధికంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ 8లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్‌గా స్టార్ యాంకర్ విష్ణు ప్రియ నిలిచిందని తెలుస్తోంది. విష్ణు ప్రియ వారానికి రూ 4 లక్షలు వరకు అదుకుంటుందని సమాచారం. ఇక హీరోగా సక్సెస్ కాలేకపోయిన ఆదిత్య ఓం వారానికి మూడు నుంచి మూడున్నర లక్షల వరకు అందుకుంటున్నాడని తెలుస్తోంది.అలాగే సీరియల్ నటి యష్మి గౌడ, టీవీ నటుడు నిఖిల్, ఆర్జే శేఖర్ బాషాలు వారానికి రూ. 2.50 లక్షలు చొప్పున పారితోషికం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఢీ డ్యాన్సర్ నైనికకు కూడా మంచి పారితోషకం అందినట్టు తెలుస్తోంది. ఆమె రూ.2.20 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. సినీ నటుడు అభయ్ నవీన్, టీవీ నటి ప్రేరణ, సినీ నటి మరియు యూట్యూబర్ కిర్రాక్ సీత, యూట్యూబర్ నబీల్ ఆఫ్రిదిలకు రూ. 2 లక్షలు చొప్పున రెమ్యునరేషన్ అందిస్తున్నారు. ఇక యూట్యూబర్ బెజవాడ బేబక్క, సినీ నటి సోనియా ఆకుల, టీవీ నటుడు పృథ్విరాజ్ వారానికి రూ. 1.5 లక్షలు ఛార్జ్ చేస్తుండగా.. మోడల్ కమ్ యాక్టర్ నాగ మణికంఠకు రూ. 1.20 లక్షలు ఇస్తున్నారట. తొలి రోజు నుంచే హౌస్ మేట్స్ తమ స్టేటజీలతో గేమ్‌ను స్టార్ట్ చేశారు. రెండో రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో ప్రేక్షకులు షోపై పెదవి విరుస్తున్నారు.












Click it and Unblock the Notifications