టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఆమే.. మీడియా సర్వే
తెలుగు సినీ పరిశ్రమలో టాప్-10 హీరోయిన్లు ఎవరు అనే విషయంపై ప్రముఖ మీడియా సంస్థ ఒక సర్వే నిర్వహించింది. అందులో ఊహించని రీతిలో ఫలితాలు వచ్చాయి. ఏడాది నుంచి ఖాళీగా ఉన్నప్పటికీ, చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత నిలిచింది. ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో ఓ సినిమా చేస్తోంది. అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీలో ఎంపికైందంటున్నారుకానీ అధికారికంగా ధ్రువీకరణ రావాల్సి ఉంది.
క్రేజ్ తగ్గని కాజల్
ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఒక ఆప్షన్ గా మారారు కాజల్ అగర్వాల్. ఆమె క్రేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. నెంబర్ 2గా కాజల్ నిలిచింది. అందంతో, నటనతో ఆకట్టుకునే అనుష్కశెట్టి టాప్3 స్థానాన్ని దక్కించుకుంది. బాహుబలి తర్వాత సెలక్టివ్ గా నే సినిమాలు చేస్తోంది. అడపా దడపా సినిమాలు చేస్తున్నప్పటికీ నెంబర్ 3లో నిలవడం విశేషం. తన అందంతో, నృత్యాలతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన శ్రీలీల నెంబర్ 4 స్థానంలో నిలిచింది. గతేడాది శ్రీలీల హీరోయిన్ గా ఉన్న సినిమాలు నెలకొకటి చొప్పున విడుదలయ్యేవి.

బాలీవుడ్ కు మహానటి?
సహజమైన అందంతో అలరారే సాయి పల్లవి ఐదోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం హిందీలో రామాయణంతోపాటు నాగచైతన్య సరసన తండేల్ సినిమా చేస్తోంది. నెంబరు 6గా నేషనల్ క్రష్ రష్మిక నిలిచారు. చేతినిండా సినిమాలతో, చేసే సినిమాలన్నీ సూపర్ హిట్లతో రష్మికకు ఫుల్ డిమాండ్ ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సీనియర్ హీరోల సరసన నటిస్తోంది.
వారికి ఈమె కూడా ఒక ఆప్షన్ అయ్యారు. తమన్నా నెంబరు 7గా నిలిచారు. గతేడాది దసరా, భోళాశంకర్ సినిమాల్లో కనిపించిన తర్వాత బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నారు. ఆమే కీర్తి సురేష్. ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సినిమాల్లేక ఇబ్బందిపడుతున్న పూజాహెగ్డే తొమ్మిదో స్థానంలో నిలిచారు. తెలుగులో నటించి చాలారోజులవుతోంది. మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ కావడంతో క్రేజ్ రెట్టింపు అయింది. టాప్10గా నిలిచారు.












Click it and Unblock the Notifications