ఒకే హీరోయిన్‌తో 130 సినిమాల్లో నటించిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక కాంబినేషన్‌లో వచ్చిన సినిమా హిట్ అయిందంటే చాలు, తిరిగి ఆ హిట్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. దర్శకుడు- హీరో, నిర్మాత- హీరో, హీరో- హీరోయిన్ ఇలా కాంబినేషన్‌లో చాలా రకాలు ఉన్నాయి. హీరో- హీరోయిన్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా హిట్ కాంబినేషన్ అంటే మూడు, నాలుగు సినిమాలు వస్తుంటాయి. కానీ ఏ హీరో ఏకంగా ఓ హీరోయిన్‌తో 130 సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించాడు.
ఆ హీరో మరెవరో కాదు..మలయాళ నటుడు ప్రేమ్ నజీర్. నటి షీలతో ప్రేమ్ నజీర్ 130 సినిమాల్లో నటించాడు. ఒకే హీరోయిన్‌తో అత్యధిక సినిమాలు చేసిన ఘనత ఆయనకు దక్కింది.వీరిద్దరూ కలిసి నటించినన్ని సినిమాలు మరే ఇతర జంటా చేయలేదు. ఈ ఘనత వారిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నిలిపింది. 1960-1970ల మలయాళ చిత్ర పరిశ్రమలో వీరిద్దరూ ఒక ఐకానిక్ జోడీగా వెలుగొందారు.

వారు కలిసి నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు:
భార్గవి నిలయం (1964)
కుట్టిక్కుప్పాయం (1964)
ముత్తులాలి (1965)
మురప్పెన్ను (1965)
కళితోళన్ (1966)
ఇరుట్టింటే ఆత్మావు (1967)
అశ్వమేధం (1967)
తులాభారం (1968)
లవ్ ఇన్ కేరళ (1968)
కళ్ళిచెల్లమ్మ (1969)
కడల్పాలం (1969)
కూట్టుకుటుంబం (1969)
అడిమకల్ (1969)
రెస్ట్ హౌస్ (1969)
నిళలట్టం (1970)
మూడల్‌మంజు (1970)
ఒథెనంతే మకన్ (1970)
దత్తుపుత్రన్ (1970)
అనుభవంగళ్ పాలిచకల్ (1971)
కళితోళి (1971)
ఒరు పెണ്ണിంటే కథ (1971)
ఓమన (1972)
ఆరోమలున్ని (1972)
చుక్కు (1973)
తుంబోలార్చ (1974)
కన్నప్పనున్ని (1977)
ఆచారం అమ్మిణి ఓషారం ఓమన (1977)
కడతనట్టు మాక్కం (1978)

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. వారిద్దరి కాంబినేషన్ మలయాళ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.వీరిద్దరూ కలిసి దాదాపు 130 సినిమాల్లో నటించారు, ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు. వారి కాంబినేషన్ మలయాళ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వారు రొమాంటిక్ జంటగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.ప్రేమ్ నజీర్ తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించారు. 'విసప్పింటే విలి'నే తెలుగులో 'ఆకలి' (1952) పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాతోనే నజీర్ తెలుగులో అడుగుపెట్టాడు. 1953లో, 'అచ్చన్' సినిమాకు రీమేక్‌గా వచ్చిన 'తండ్రి' అనే మరో తెలుగు సినిమాలోనూ నటించారు. అయితే తెలుగులో ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో , ఆయన మలయాళంలోనే నటించారు.












Click it and Unblock the Notifications