పది రోజుల షూటింగ్‌కు 9 కోట్లు తీసుకున్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?
హీరోల కెరీర్‌తో పోలిస్తే హీరోయిన్లు కెరీర్ చాలా తక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్లు , ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లు, తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. కానీ వీరు మాత్రం ఇంకా హీరోలుగానే చేస్తున్నారు. అలాగే హీరోల పారితోషకంతో పోలిస్తే హీరోయిన్ల పారితోషకాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. కోట్లలో రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోయిన్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
అలాంటి ఓ హీరోయిన్ 10 రోజులు షూటింగ్ చేసి ఏకంగా తొమ్మది కోట్లు పారితోషకం తీసుకుని సంచలనం సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు స్టార్ హీరోయిన్ ఆలియా భట్. బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్‌గా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే ఆలియా భట్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాకుండానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆలియాకు వరుస అవకాశాలు వచ్చాయి.

దీంతో ఆలియ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమయాణం సాగించింది. అప్పటికే రణబీర్ కపూర్ దీపిక పదుకొనె, కత్రినా వంటి హీరోయిన్స్‌తో ఎఫైర్ సాగించాడు. వారితో బ్రేకప్ తర్వాత ఆలియాతో ప్రేమలో పడ్డాయి. 2022 ఏప్రిల్ 14న ఆలియా భట్.. రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. రణబీర్, ఆలియా దంపతులకు ఒక కూతురు ఉంది. ఆలియా భట్ RRR సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ఆలియా భట్ సీత పాత్రలో కనిపించింది. నిడివి తక్కువ అయినా, ఆలియా భట్ పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాకి అలియా పది రోజులు షూటింగ్‌లో పాల్గొంది. అయితే, పదిరోజులకు ఏకంగా రూ.9 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది.మొత్తానికి 10 రోజులకు గానూ 9 కోట్లు తీసుకున్న హీరోయిన్‌గా ఆలియా భట్ నిలిచింది.












Click it and Unblock the Notifications