ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గానా..? షాకిచ్చిన స్టార్ హీరోయిన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మాస్ డైలాగులు చెప్పడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇక డ్యాన్స్‌ల్లో కూడా ఎన్టీఆర్ అదరగొడుతుంటారు. ఎంతో కష్టమైన స్టెప్స్‌ను సైతం ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవలే ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి కామెంట్స్ చేశారు. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటారని ఆమె చెప్పడం జరిగింది. ' RRR ' సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతుంది. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన 'దేవర' చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన సత్తాను చాటారు. మొదట్లో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది దేవర. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినాను మరోసారి నిరూపించింది.

who the heroine was who rejected NTR three times

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్టీఆర్‌ను ఓ హీరోయిన్ ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు..ఆలియా భట్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగుతున్న ఆలియా భట్, ఎన్టీఆర్‌తో మూడుసార్లు నటించే అవకాశం వచ్చినప్పటికీ, ఆ ఆఫర్లను తిరస్కరించారట. కొన్నిసార్లు కథ నచ్చక ,మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట . మొత్తానికి RRR సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆలియా భట్. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కాకుండా రామ్ చరణ్‌కి జోడిగా నటించింది ఆలియా భట్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా ఎన్టీఆర్‌తో మూడుసార్లు నటించే అవకాశం వచ్చినా కూడా ఈ అమ్మడు వదులుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+