పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై త్రివిక్రమ్ ఎందుకు స్పందించడం లేదు..?

ఇటీవల కాలంలో బాగా విమర్శలు ఎదుర్కొన్న దర్శకుల్లో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ మొదటి స్థానంలో ఉంటారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. మహేష్ బాబులాంటి స్టార్ హీరోను పెట్టుకుని సరైన కథ లేకుండా సినిమా తీయడంపై అభిమానులు గురూజీపై గట్టిగానే ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌,హీరోయిన్‌ పూనమ్ కౌర్‌ల మధ్య విభేదాలున్న సంగతి అందరికి తెలిసిందే.

పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ విషయంలో పూనమ్ కౌర్‌కు త్రివిక్రమ్‌ అడ్డుపడ్డారనే టాక్ సినీ వర్గాల్లో నడుస్తోంది. అప్పటి నుంచి కూడా వీలు కుదిరినప్పుడల్లా త్రివిక్రమ్‌‌ టార్గెట్‌గా ఆమె విమర్శలు చేస్తుంటారు. తాజాగా జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేసే అస్టిస్టెంట్‌పై జానీ మాస్టర్ అత్యాచారానికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. గత కొంతకాలంగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అస్టిస్టెంట్‌ డ్యాన్స్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదు చేసింది.

Why is Trivikram not responding to Poonam s controversy

దీంతో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంది.అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ విడుదల చేసింది. అయితే దర్శకుడు త్రివిక్రమ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓ ట్వీట్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ మీదతాను చేసిన కంప్లైంట్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.

తనకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మూలంగానే ఆ రోజు తాను చేసిన కంప్లైంట్‌ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన చెందారు. అయితే పూనమ్ కౌర్ ఇంతలా తన మీద విమర్శలు చేస్తోన్న త్రివిక్రమ్ ఎందుకు స్పందించడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. ఎటువంటి తప్పు చేయనప్పుడు, తన మీద వస్తోన్న విమర్శలకు త్రివిక్రమ్‌కు సమాధానం చెప్పవచ్చు కదా అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. మరోవైపు పూనమ్ కౌర్ చేసిన ఆరోపణలపై డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మా ఫిర్యాదు బాక్స్‌లో ఓ ఫిర్యాదు లెటర్ వేస్తే.. దానిపై ఏదైనా చర్యలు తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామని ఆయనపేర్కొన్నారు. ఇప్పటికైనా రాత పూర్వక ఫిర్యాదు చేస్తే... తగు చర్యలు తీసుకుంటామని పూనమ్ కౌర్‌కు తమ్మారెడ్డి భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+