పేరుకే తెలుగులో స్టార్ హీరో..100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థితి గతి ఒక్కసారిగా మారిపోయాయి. చిన్న హీరోలు సైతం ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ తమ స్టామినా నిరూపించుకుంటున్నారు. వీరందరూ కూడా 1000 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలే. అయితే వీరి కంటే క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క రూ.100 కోట్ల సినిమా కూడా లేకపోవడం విశేషం.
పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనుకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషీ సినిమాతో పవన్ కల్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

పవన్ కల్యాణ్ కెరీర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా ఖుషీ సినిమా నిలిచింది. ఆ తర్వాత ఆయనకు పదేళ్ల పాటు హిట్ సినిమా లేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ కెరీర్‌లో చాలా హిట్లు ఉన్నాయి. అయితే అవి ఏవి కూడా పవన్ కల్యాణ్‌ను 100 కోట్ల మార్కెట్‌లో చేర్చలేకపోయాయి. ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు సినిమా సైతం పవన్ కల్యాణ్ కెరీర్‌లో అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం ఓజీ. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా అంచనాలు మరింత పెంచేశాయి. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ రూ.100 కోట్ల మార్కెట్‌ను అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో పవన్ కల్యాణ్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications