నా భర్త ఆమెతో ఎఫైర్ పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నా...స్టార్ హీరో భార్య సంచలనం
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు.
తాజాగా ఓ హీరో భార్య సంచలనం సృష్టించింది. తన భర్త ఎఫైర్ పెట్టుకున్నాడని చెప్పి రోడ్డెక్కింది హీరో భార్య. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో 'పవర్ స్టార్'గా, 'కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్'గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ సింగ్ వ్యక్తిగత జీవితం మాత్రం సినిమా కథను తలపిస్తుంది. తన వైవాహిక జీవితంలో ప్రేమ, విషాదం, విడాకులు, వివాదాలు అన్నీ ఉన్నాయి.

పవన్ సింగ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని జ్యోతి సింగ్ ఆరోపించారు. వరకట్నం కోసం వేధింపులు, గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కొట్టేవారని, బలవంతంగా అబార్షన్ చేయించారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో వీరి వైవాహిక జీవితం విడాకుల కోర్టు మెట్లెక్కింది. తన భర్త తనను ఇంటి నుంచి గెంటేసి, అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ సింగ్ వేరే అమ్మాయితో హోటల్‌కు వెళ్తాడు అని జ్యోతి సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది.పవన్ సింగ్ మరొక అమ్మాయితో హోటల్‌కు వెళ్లడం చూసి కూడా ఎవరూ అతన్ని ప్రశ్నించరని జ్యోతి సింగ్ వాపోయింది. భర్త వేరే అమ్మాయితో ఉండటం భార్యగా నేను భరించలేకపోయానని చెప్పుకొచ్చింది. పవన్ సింగ్ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ, వీరి మధ్య విడాకుల కేసు ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది.
మొదటి భార్య నీలం సింగ్ - విషాదాంతం:
పవన్ సింగ్ మొదటిసారిగా నీలం సింగ్‌ను 2014లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కేవలం 5 నెలలకే, 2015లో నీలం సింగ్ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను, పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి గల కారణాలు నేటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. పవన్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటన ఆయన జీవితంలో ఒక విషాద అధ్యాయంగా మిగిలిపోయింది.
రెండో భార్య జ్యోతి సింగ్ - వివాదాస్పద విడాకులు:
తొలి భార్య మరణం తర్వాత పవన్ సింగ్ 2018లో జ్యోతి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పవన్ సింగ్ ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఒక ప్రచార కార్యక్రమ వేదికపై హీరోయిన్ అంజలి రాఘవ్‌ను అసభ్యంగా తాకడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆ నటి ఆవేదన వ్యక్తం చేస్తూ భోజ్‌పురి పరిశ్రమను వీడుతున్నట్లు ప్రకటించడం పవన్ సింగ్‌పై ట్రోలింగ్‌ను మరింత పెంచింది.












Click it and Unblock the Notifications