స్టార్ హీరోకు మరో తలనొప్పి, ఏకంగా కేసు పెట్టిన 35 మంది మహిళలు, నువ్వు సెలబ్రిటీనా ?
శ్యాండిల్ వుడ్ స్టార్ హీరో, చాలెంజింగ్ స్టార్, డీ బాస్ దర్శన్ కు వరుసగా సినిమా కష్టాలు మొదలైనాయి. ఇటీవల భార్య విజయలక్ష్మి, గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడ సోషల్ మీడియా వార్ తో హీరో దర్శన్ మైండ్ బ్లాక్ అయ్యింది. రెండు రోజుల క్రితం హీరో దర్శన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కన్నడ ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లు హీరో దర్శన్ మీద మరో కేసు నమోదు అయ్యింది.
జనవరి మొదట్లో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కు మంచి రోజులు వచ్చాయని అందరూ అనుకున్నారు. అందుకు కారణం డిసెంబర్ చివరి వారంలో విడుదల అయిన కాటేరా సినిమా ఎవ్వరూ ఊహించని విదంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కాటేరా సినిమా సుమారు రూ 200 కోట్లకు పైగా వసూలు చేసింది. పెద్దపెద్ద హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాల దెబ్బను తట్టుకుని కేవలం కన్నడ బాషలో మాత్రమే విడుదల అయిన కాటేరా సినిమాతో చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఆయన సత్తా చాటాడు.

అయితే కాటేరా సినిమా హిట్ అయిన సంతోషాన్ని ఆయనకు ఎక్కువ రోజులు ఆస్వాదించలేకపోయాడు. తరువాత హీరో దర్శన్ వరుస కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు హీరో దర్శన్ కు మరో సమస్య వచ్చింది, శ్రీ శక్తి మహిళా స్వయం సహాయక సంఘానికి చెందిన సుమారు 35 మంది మహిళలు దర్శన్‌పై బెంగళూరు సిటీలోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం బయటకు రావడంతో ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు హడలిపోయారు.
ఈ ఫిర్యాదు ఎందుకు అనే సమాచారాన్ని ఇప్పుడు అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ కన్నడ నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ పై పరుష పదజాలం వాడడమే కాకుండా మహిళలపై కూడా చులకనగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. నటుడు దర్శన్ పెద్ద సెలబ్రిటీ. ఆయన్ను చూసి నేర్చుకోవాల్సిన వారు చాలా మంది ఉన్నారు, ఓ సెలబ్రిటీగా దర్శన్ ఇలా మాట్లాడడం మాకు చాలా బాధ కలిగించింది అని మహిళలు ఆరోపిస్తున్నారు.

ఏదైనా సభలు, సమావేశాలు, వేదిక మీద మాట్లాడేటప్పుడు కూడా హీరో దర్శన్ నోరు పారేసుకుంటున్నారని, మహిళలను కించపరిచేలా దర్శన్ మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు హిందుస్థాన్ గెజిట్ పేర్కొంది. నీకు జన్మనిచ్చింది ఓ ఆడది, మీ అక్క కూడా ఓ ఆడది అన్న విషయం మరిచిపోయి ప్రతి మీటింగ్‌కి వచ్చి వెళ్లే మహిళల గురించి అది వస్తోంది, అది పోతుంది అంటూ మహిళలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని, దయచేసి మీ మాట తీరును మార్చుకోవాలని హీరో దర్శన్ కు మహిళలు సూచించారు.
హీరో దర్శన్ ఇలాగే మాట్లాడితే పెద్దఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఓ మహిళ హెచ్చరించినట్లు సమాచారం. ఇదే విషయమై ఫిబ్రవరి 22వ తేదీన ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే నటుడు దర్శన్‌పై మహిళా సంఘ సంస్థలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. మరో ఫిర్యాదు అందడంతో నటుడు దర్శన్ మళ్లీ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మరి దీనిపై శ్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఎలా స్పందిస్తాడో వేచిచూడాలి. మహిళా సంఘాలు ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి అంటున్నారు న్యాయనిపుణులు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications