నా కథను మానభంగం చేసేశారు..!
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా పరిచయమైన చిత్రం 'సరస్వతి'. ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రం చుట్టూ ఇప్పుడు ఓ పెద్ద వివాదం నెలకొంది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా చిత్ర బృందంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పరిశ్రమలో చర్చకు దారితీసింది.
అసలేం జరిగింది?
సాయి మాధవ్ బుర్రా తన సోషల్ మీడియా పోస్ట్‌లో నేరుగా సినిమా పేరు ఎత్తనప్పటికీ.. ఆయన కామెంట్స్ 'సరస్వతి' చిత్రానికే ఉద్దేశించినవని స్పష్టమవుతోంది. ఆయన ఆవేదనలోని ముఖ్యాంశాలు ఇవే. ఈ ప్రాజెక్ట్ తన కథతోనే మొదలైందని, కానీ ముగింపు వచ్చేసరికి దాన్ని పూర్తిగా మార్చేశారని ఆయన ఆరోపించారు. తనకు సమాచారం ఇవ్వకుండానే స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేశారని మండిపడ్డారు. తాను రాసిన ఒరిజినల్ కథలో ఒక లోతైన భావోద్వేగం ఉందని, కానీ మేకర్స్ దాన్ని కేవలం ఒక 'రివెంజ్ డ్రామా' (ప్రతీకార కథ)గా మార్చి కథలోని ఆత్మను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కథను మేకర్స్ తమకు నచ్చినట్లుగా మార్చుకుంటూ "దుర్వినియోగం" చేశారని ఆయన ఘాటుగా విమర్శించారు.

డైరెక్షన్ చేయాలనుకుని.. చేజారి..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సాయి మాధవ్ బుర్రా ఈ కథను స్వయంగా దర్శకత్వం వహించాలనే ఆలోచనతో రాసుకున్నారు. అయితే కొన్ని తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ చేతుల్లోకి వెళ్లింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వరలక్ష్మి తన ఇంటర్వ్యూలలో, ప్రమోషన్లలో కథ గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఎక్కడా రచయితగా సాయి మాధవ్ బుర్రా పేరును ప్రస్తావించలేదని ఆయన పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.
Writer Sai Madhav Burra shocking allegations on #Saraswathimovie #SarawathiReview #SaraswatiMovie #VaralaxmiSarathkumar pic.twitter.com/Ek8H7dU6NB
— Sandeep Athreya (@SandeepAthreyaX) March 6, 2026
సినీ ఇండస్ట్రీలో చర్చ
ఒక రచయిత రాసిన మూల కథను దర్శకులు లేదా నిర్మాతలు తమ ఇష్టానుసారం మార్చేయడం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. కానీ సాయి మాధవ్ బుర్రా వంటి సీనియర్ రచయిత బహిరంగంగా స్పందించడం సంచలనంగా మారింది.త్వరలో జరగబోయే 'సరస్వతి' చిత్ర ప్రెస్ మీట్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ లేదా నిర్మాణ సంస్థ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.
-
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
టాలీవుడ్‌లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా?












Click it and Unblock the Notifications