పవన్ "ఓజీ" అద్బుత విజయం సాధిస్తుంది - అంబటి
తెలుగురాష్ట్రాల్లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మేనియా నడుస్తోంది. ఈ చిత్రంపై రోజురోజుకీ హైప్ భారీగా పెరుగుతోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకుల కూడా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఓజీకి ప్రత్యేక అనుమతులు ఇచ్చాయి. బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో అనధికారిక రివ్యూలు, అంచనాలు మొదలయ్యాయి. పలువురు హీరోలు సైతం సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సాధారణంగా పవన్ కళ్యాణ్‌పై ఎప్పుడూ విమర్శలు గుప్పించే వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈసారి మాత్రం 'ఓజీ'పై పాజిటివ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. పవన్ నటించిన 'ఓజీ' ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన గత రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. అందువల్ల ఈసారి పవన్ కసితో పనిచేశారని అనుకుంటున్నాను. దాంతో పాటు డైరెక్టర్ గత సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
కాబట్టి ఈ చిత్రాన్ని హిట్ చేయాలని ఆయన గట్టి పట్టుదల కలిగి ఉంటాడు. మూడోది చిత్ర నిర్మాత దానయ్య. ఈ చిత్రం హిట్టు కొట్టాలని ఆయన ఖర్చుకి వెనకాడలేదు. ఇన్ని పట్టుదలల మధ్య జరిగిన నిర్మించిన ఈ చిత్రం కొంత మెరుగైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతున్నా. ఆ నమ్మకంతో 'ఓజీ' కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మాకు ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తుంటాం. అవి కూడా సద్విమర్శలే చేస్తాం అంటూ అంబటి రాంబాబు వీడియోలో పేర్కొన్నారు. దీంతో అంబటి కామెంట్స్ పట్ల వైసీపీ నేతలు షాక్ అవుతున్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానేసి.. సినిమా రివ్యూలు ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా అంటూ కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనుండగా, సిరి లేళ్ల (నారా రోహిత్ కాబోయే భార్య), అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications