కమల్ హాసన్‌కి స్టార్ హీరో వార్నింగ్.. కన్నడ జోలికి వస్తే ఊరుకోం !

లోక నాయకుడు కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "థగ్ లైఫ్". గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 5, 2025న విడుదల అయ్యి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో స్టార్ హీరో శింబు కూడా నటించగా అభిరామి, త్రిష హీరోయిన్స్ గా నటించారు. కమల్ - మణి కాంబోలో గతంలో వచ్చిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ "నాయకుడు" మూవీ లానే.. ఈ చిత్రం కూడా అందర్నీ మెప్పిస్తుందని భావించగా.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కాగా సినిమా సంగతి పక్కన పెడితే కమల్ హాసన్ కి మాత్రం చిక్కులు వచ్చాయి.

'థగ్ లైఫ్' ఈవెంట్ లో తమిళ భాష నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను కన్నడ సంఘాలు, అధికార విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (KFCC) కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. న్యాయస్థానం సైతం కమల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. కానీ కమల్ మాత్రం తగ్గకుండా సారీ చెప్పనంటూ ఇన్ డైరెక్ట్ గా తెలిపారు. 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేయకుండా ఆపేశారు.

young-hero-dhruv-sarja-shocking-comments-on-kamal-haasan

ఇప్పుడు ఈ ఇష్యూలో కన్నడ స్టార్ హీరో కూడా ఎంటర్ అయ్యారు. కమల్ హాసన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే మా మాతృభాష జోలికొచ్చి , మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే అసలు ఊరుకోం అంటూ హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఏం జరిగింది ??

కన్నడ స్టార్ హీరో ధ్రువ సార్జా నటిస్తున్న చిత్రం కేడీ : ది డెవిల్. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ , శిల్పా శెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించగా.. రేష్మ నానయ్య హీరోయిన్ గా నటించింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా ఒక రిపోర్టర్.. ఒక తమిళ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించారు.

young-hero-dhruv-sarja-shocking-comments-on-kamal-haasan

అందుకు ధ్రువ సార్జా మాట్లాడుతూ.. తాను పుట్టకముందు నుంచే తమిళ్ సినిమాలు కర్ణాటకలో విడుదలవుతున్నాయని అన్నారు. కానీ ఏ ఒక్క మూవీని ఎవరు కూడా ఆపలేదని చెప్పారు. కమల్ హాసన్ సార్ అలాంటి కామెంట్లు చేయడం తోనే థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరికైనా మాతృభాష అంటే గౌరవం ఉంటుందని.. అందరిలాగే తాము కూడా తమ భాషను ప్రేమిస్తామని తెలిపారు. భాష గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే స్పందించకుండా ఉండలేమని క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా సరే తమ మాతృభాష జోలికొచ్చి , తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే అసలు ఊరుకోమన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+