ఇదేం పిచ్చి ఐడియా.. లవర్, ఎక్స్ లవర్‌తో కలిసి సినిమాకు వెళ్లాలని యంగ్ హీరో రిక్వస్ట్
సినిమా రిలీజ్ టైమ్ లో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్న కామెంట్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గానే విశ్వక్ సేన్ 'లైలా', సందీప్ కిషన్ 'మజాకా' చిత్రాల విషయంలో ఇదే జరిగింది. లైలా ఈవెంట్ లో కమెడియన్ పృధ్వీ కామెంట్స్ వల్ల సినిమా బ్యాన్ చేయాలనే రేంజ్ లో ట్రోలింగ్ చేస్తే హీరో బహిరంగంగా క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది. అలానే మజాకా ఈవెంట్ లో డైరెక్టర్ హీరోయిన్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మరో యంగ్ హీరో మూవీ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. రాజు వారు రాణిగారు సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. రీసెంట్ గానే 'క ' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'దిల్ రుబా'. మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ హీరో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ కిరణ్ ఏమన్నారంటే..
దిల్ రూబా సినిమాకి వీలైతే మీ లవర్‌తో, కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ మీ ఎక్స్‌తో కలిసి సినిమాకి వెళ్ళండి. బయటికి వచ్చేటప్పుడు మీరు మీ లవర్, మీ ఎక్స్ ముగ్గురూ చాలా హ్యాపీగా బయటికి వస్తారు అంటూ చెప్పారు. ఎక్స్ మీద మనకు ప్రేమ పోవచ్చు కానీ ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను వారితో కలిసి చూడండి అంటూ తెలిపారు. అయితే కిరణ్ కామెంట్లపై నెటిజన్లు వింతగా స్పందిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావ్ అన్న నరాలు కట్ అవుతున్నాయి, బుర్రపాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అవసరం తీరిపోయాక చెప్పే థాంక్స్ కి నా దృష్టిలో వాల్యూ లేదు అనే డైలాగ్ తో ఆసక్తికరంగా ఉంది. ఒక యువకుడి లైఫ్ లో ప్రెజెంట్ లవ్ తో పాటు ఎక్స్ కూడా ముఖ్య పాత్ర పోషించే విధంగా ఈ స్టోరీ ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications