రూ.వందల కోట్లకు అధిపతిగా మారిన జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఉన్న యువ నటుల్లో నవరసాలను పోషించగలిగే ఏకైక నటుడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 27వ తేదీన విడుదల కాబోతోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగంపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీగా ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతోంది.
తన సొంత కష్టంతోనే సంపాదించారు
నిను చూడాలని సినిమాతో పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ కథానాయకుడిగా మారారు. ఈ క్రమంలో ఎన్నో సంచలన విజయాలను సాధించారు. సినిమా సినిమాకు తన రేంజ్ ను, క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్న యంగ్ టైగర్ ఈ క్రమంలో వందల కోట్లరూపాయలకు అధిపతిగా మారారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాకుండా తన సొంత ఆదాయం ద్వారానే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నారు. తారక్ కు వాచ్ లు అంటే చాలా ఇష్టం.

అమెరికాలో పెట్టుబడులు పెట్టారు
రూ.4 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే వాచ్, రూ.2.5 కోట్ల ఖరీదు చేసే పటెక్ ఫిలిప్ నాటిలస్ 40ఎంఎం వాచ్ వంటిని సేకరించారు. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్, రేంజ్ రోవర్, BMW, పోర్స్చే, మెర్సిడెస్-బెంజ్ కార్లున్నాయి. రూ.70 కోట్ల విలువ చేసే ప్రయివేట్ జెట్ ను ఎన్టీఆర్ కలిగివున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రూ.25 కోట్ల విలువచేసే అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్నారు. సంపాదిస్తున్న సొమ్మును హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారు. వీటితోపాటు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అమెరికాలో వ్యాపారంచేసే అతి తక్కువ వ్యాపారవేత్తలో తారక్ ఒకరు. నెలకు రూ.3 కోట్లు సంపాదిస్తున్న ఎన్టీఆర్ వార్షికాదాయం రూ.36 నుంచి రూ.40 కోట్లుగా ఉంది. ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ రూ.600 కోట్లుగా ఉన్నట్లు ఓ ఫైనాన్షియల్ సంస్థ నివేదిక రూపొందించింది.












Click it and Unblock the Notifications