యూట్యూబ్ స్టార్ నాగదుర్గ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తెలంగాణకు చెందిన యూట్యూబ్ స్టార్ నాగదుర్గకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోక్ సాంగ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ నాగదుర్గ.. తన డ్యాన్స్, నటనతో కుర్రకారును ఆకట్టుకుంది. ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం నాగదుర్గ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో 'కలివనం'సినిమాతో మెప్పించిన నాగదుర్గ.. ఇటీవల తమిళ సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ సరసన 'లవ్ ఓ లవ్' సినిమాలో ఆమె నటించగా.. ఆ చిత్రం జూన్ 10న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఓ డిజాస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా.. రిలీజ్ అయిన 3 వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం కాగా.. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా జులై 31 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించింది.

YouTube star Nagadurga Love O Love OTT Release Date Fixed Stream it on Amazon Prime Video

తమిళ చిత్ర పరిశ్రమలో సక్సెస్ కాలేకపోయిన నాగదుర్గ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే నాగదుర్గ "ఇడుపు కాయితం" అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ నటుడు ప్రియదర్శి సరసన నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.. చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కొంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా టైటిల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. సోషల్ మీడియాలో నెటిజన్లు యాసల గురించి చర్చించారు. అయితే ఈ వివాదంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి ముగింపు పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+