Shanmukh Jaswanth: అడ్డంగా దొరికిపోయిన షణ్ముక్ జశ్వంత్.. ఇక జైలే..!
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో దొరికిపోయాడు. అతనే కాదు అతడి అన్నయ్య సంపత్ వినయ్ కూడా అరెస్ట్ అయ్యాడు.పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్, అతని సోదరుడు సంపత్ వినయ్ కోసం జశ్వంత్ ప్లాట్ వెళ్లారు. అక్కడ పోలీసుల జరిపిన సోదాల్లో గంజాయి దొరికింది. దీంతో పోలీసులు వెంటనే షణ్ముఖ్ జశ్వంత్, సంపత్ వినయ్ ని అరెస్ట్ చేశారు. సంపత్ వినయ్ కొంత కాలంగా ఓ అమ్మాయితో లవ్ ఉన్నారు. ఆమెతో సన్నిహతంగా గడిపాడు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకున్నాడు. ఆ తర్వాత పెళ్లికి మొఖం చాటేయడంతో మోసపోయనని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంపత్ వినయ్ కోసం జశ్వంత్ ప్లాట్ వెళ్లారు. అక్కడ పోలీసులకు అనుమానం వచ్చి సోదాలు చేశారు. సోదాల్లో గంజాయ్ గుర్తించారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షణ్ముక్ జశ్వంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రెండో స్థానంలో నిలిచాడు.

షణ్ముక్ జశ్వంత్ మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాడు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరస్టయ్యాడు. షణ్ముక్ యూట్యూబ్ తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లాడు. ఆ తర్వాత వెబ్ సిరీస్ ల్లో నటించాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్ వంటి వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం షణ్మక్, అతడి సోదరుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.












Click it and Unblock the Notifications