అఖిల్ భార్య షాకింగ్ పోస్టు.. నాగార్జునను అలా అనేసిందేంటి..!
కింగ్ నాగార్జున ఇవాళ 66వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. కింగ్ నాగార్జున బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేశారు. అలాగే నాగార్జున బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం రగడ మూవీని రీ- రిలీజ్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అటు అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ తన తండ్రిని కలిసి స్పెషల్ గా విషెస్ అందజేశారు.
అయితే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ రావ్జీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జైనాబ్ తన మామగారు నాగార్జునతో కలిసి స్టిల్ ఇచ్చిన ఫోటోను షేర్ చేసింది. అంతేకాక నిజమైన రాజు అనే పదానికి నిజమైన అర్థం మీరే.. రోజూ మీరు మాకు స్పూర్తినిస్తూనే ఉంటారు. నా తండ్రిగా ఉన్నందుకు నేనెంతో కృతజ్ఞురాలిని అంటూ రాసుకొచ్చింది. ఆమె పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
నాగార్జున వరుసకి మామ అయినప్పటికీ జైనాబ్ నాగార్జునను నాన్న అని పిలుస్తుందంటే నాగ్ ఆమెను ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టు చూసిన అక్కినేని ఫ్యాన్స్ సంతోషంతో మునిగిపోతున్నారు. ఇక అఖిల్, జైనాబ్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. 2025 జూన్ 6న వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటూ అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఇక నాలుగు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న నాగార్జున.. ఇప్పటి వరకూ 99 సినిమాల్లో నటించారు. ఇక కింగ్ నాగ్ 100 సినిమా గురించి ఆయన బర్త్ డే సందర్భంగా ఇవాళ ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. అయితే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications