Fact Check : హత్రాస్ వెళ్తూ హాస్యమా.. రాహుల్-ప్రియాంక నవ్వులు.. ఆ ఫోటోలో నిజమెంత?

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఫోటో ఇటీవల హత్రాస్‌ బయలుదేరేముందు దిగిన ఫోటో అన్న ప్రచారం జరుగుతోంది. 'గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మీ ముఖాల్లో ఎంత దు:ఖం పొంగి పొర్లుతుందో...' అని ఆ ఫోటో చూశాక కొంతమంది నెటిజన్స్ రాహుల్,ప్రియాంకలను విమర్శిస్తున్నారు. అయితే ఆ ఫోటో నిజంగా హత్రాస్ బయలుదేరే ముందు తీసుకున్నదేనా...? హత్రాస్ పర్యటనకు అసలు ఆ ఫోటోకి సంబంధం ఉందా..? అంటే లేదనే సమాధానమే వస్తోంది.

నిజానికి ఆ ఫోటో గత ఏడాది ఏప్రిల్‌లో తీసుకున్నది. రాహుల్,ప్రియాంకలు ఎన్నికలు క్యాంపెయిన్‌లో భాగంగా చెరో కార్యక్రమానికి వెళ్తూ కాన్పూర్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ తన సోదరిని నవ్వుతూ విష్ చేసి సరదాగా ఓ జోక్ కూడా చెప్పారు. 'ఒక సోదరికి మంచి సోదరుడిలా ఉండటమంటే ఏంటో మీకిప్పుడు చెప్తాను... నేనిప్పుడు చాలా దూరం వెళ్లబోతున్నాను... కానీ నాకు చిన్న హెలికాప్డర్ మాత్రమే ఉంది. నా సోదరి చాలా తక్కువ దూరమే వెళ్తున్నారు... కానీ ఆమెకు పెద్ద హెలికాప్టర్ ఉంది...' అంటూ రాహుల్ చేసిన కామెంట్‌కు ఇద్దరూ నవ్వేశారు.

Fact check: Did Rahul, Priyanka joke on their way to Hathras

ఈ ఫోటోను ఇటీవలి హత్రాస్ టూర్‌కు ఆపాదిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో రాహుల్,ప్రియాంకలను విమర్శిస్తున్నారు. వాళ్లిద్దరూ సరదా జోక్స్‌తో నవ్వుకున్న మాట నిజమే... కానీ ఆ ఫోటో ఇప్పటిది కాదు.రాహుల్,ప్రియాంకల హత్రాస్ టూర్‌కి దానికి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఈ ఫోటో చుట్టూ జరుగుతున్న ప్రచారంలో సగం నిజం మాత్రమే ఉంది.

Fact Check

వాదన

హత్రాస్ పర్యటనకు వెళ్లేముందు రాహుల్-ప్రియాంక చిరునవ్వులు చిందిస్తూ ఫోటో దిగారు...

వాస్తవం

ఆ ఫోటో 2019,ఏప్రిల్‌లో కాన్పూర్‌లో దిగినది.

రేటింగ్

Half True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+