Fact Check:తెలుగు భాషను అమెరికా అధికారికంగా గుర్తించిందా..?

అమెరికా ఎన్నికల సందర్భంగా ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలుగు భాషను అమెరికా అధికారిక భాషగా గుర్తించిందని పేర్కొన్న ఓ పోస్టు వైరల్‌గా మారింది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారి జనాభా ప్రతి ఏటా క్రమంగా పెరిగిపోతున్నందున తెలుగు భాషను అధికారికంగా అమెరికా గుర్తించిందని చెబుతూ ఆ ఫోటోను నెటిజెన్లు వైరల్‌గా మార్చారు. ఇప్పటికే ఈ ఫోటోను చాలామంది నెటిజెన్లు షేర్ చేశారు.

Recommended Video

    US Elections 2020 : Telugu Appears on Ballot Boxes | Voter Ballot Papers In Telugu | Oneindia Telugu

    అయితే వైరల్‌గా మారుతున్న ఈ పోస్టు అవాస్తవం. ఇందులో నిజం లేదు. అమెరికా ప్రభుత్వం తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తించలేదు. ఆ మాటకొస్తే అమెరికాలో ఎక్కువగా మాట్లాడే ఇంగ్లీష్ భాషకు కూడా అధికారిక గుర్తింపును ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. అంతేకాదు ఓ వార్తా పత్రిక కూడా తెలుగు భాషను అమెరికా ప్రభుత్వం అధికారిక భాషగా గుర్తించిందని, అమెరికా బ్యాలెట్ పేపర్‌పై తెలుగు భాష ఉందంటూ కథనం కూడా ప్రచురించింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి జనాభా పెరుగుతోంది కనుక బ్యాలెట్ పేపర్‌పై తెలుగు భాషతో పాటు ఇతర భాషలను కూడా ముద్రించారు. అయితే తెలుగు భాషను మాత్రం అధికారిక భాషగా అమెరికా ప్రభుత్వం గుర్తించలేదు.

    Fact Check:Telugu recognised as official language by US, Post goes viral on socialmedia

    ఇక తెలుగును అమెరికా ప్రభుత్వం అధికారిక భాషగా గుర్తించిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు సరికదా ఇప్పటి వరకు ఇంగ్లీషునే ఆ ప్రభుత్వం అధికారిక భాషగా గుర్తించలేదు. అసలు అమెరికాకు అధికారిక భాష అంటూ ఏమీ లేదు. ఇంగ్లీషును అధికారిక భాషగా ప్రకటించాలని పలుమార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. అయినప్పటికీ అమెరికాలో ఇంగ్లీషు భాషనే ఎక్కువగా మాట్లాడతారు. ఇక అమెరికాలో బ్యాలెట్ పేపర్లను చాలా భాషల్లో ముద్రిస్తారు. కొందరికి ఇంగ్లీషు అర్థంకాకపోవచ్చని ఇలా చేస్తారు. తెలుగులో బ్యాలెట్ పేపర్‌ను ముద్రించినంత మాత్రానా తెలగును అధికారిక భాషగా గుర్తించినట్లు కాదు.

    Fact Check:Telugu recognised as official language by US, Post goes viral on socialmedia

    Fact Check

    వాదన

    తెలుగును అధికారిక భాషగా అమెరికా గుర్తించింది

    వాస్తవం

    తెలుగే కాదు అమెరికాలో అధికారిక భాష అంటూ ఏదీ లేదు

    రేటింగ్

    Misleading
    ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+