Fact check:కాంగ్రెస్ తరుఫున అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం..వాస్తవం ఏంటీ...?

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశేయోక్తి కాదు. అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఈ ఫ్యాన్ ఇండియా స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలోస్తున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ రాజకీయాకు దూరంగా ఉన్నప్పటికీ .. రాజకీయాలు మాత్రం ఆయన్ను వదలడం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఎత్తున వైసీపీలో చేరారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి చిన్నియాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభిమానులు మంత్రి అమర్‌నాథ్ నివాసంలో వైసీపీలో చేరారు.

Fact check video of Allu Arjun campaigns for congress goes viral is false

మెగా అభిమానులు సాధారణంగానే పవన్ పార్టీకి అండగా ఉంటున్నారు. కానీ తాజాగా అల్లు అర్జున్ అభిమానులు వైసీపీలో చేరి జగన్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా అల్లు అర్జున్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ పక్కన ఆయన భార్య స్నేహరెడ్డి కూడా ఉన్నారు. స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దీంతో అల్లు అర్జున్ నిజంగానే కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేశారని అభిమానులు భావించారు. అయితే అల్లు అర్జున్ ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి కాంగ్రెస్‌కు అనుకూలంగా వైరల్ చేస్తున్నారని తరువాత తెలిసింది. వాస్తవానికి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైయ్యారు. ఆ సమయంలో బన్ని జాతీయ జెండాతో ర్యాలీ చేశారు. అప్పటి ఫొటోలను, వీడియోను ఎడిట్ చేసి ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై బన్ని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Fact Check

వాదన

కాంగ్రెస్‌కు అల్లు అర్జున్ ప్రచారం

వాస్తవం

వాస్తవానికి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైనప్పటి వీడియో.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+