ప్రత్యేకం: చుక్కా రామయ్య కాలమ్ ప్రారంభం
చుక్కా రామయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. జగమెరిగిన చుక్కా రామయ్యను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాజీ ఎమ్మెల్సీగా కన్నా విద్యావేత్తగా ఆయన ప్రసిద్ధులు. తెలుగువారికి ఐఐటి అత్యంత సన్నిహితం చేసిన విద్యావేత్త, శిక్షకుడు ఆయన. ఐఐటి రామయ్యలో చదివినవారికి ఐఐటి కోర్సులో తప్పనిసరి ప్రవేశం లభిస్తుందనే విశ్వాసాన్ని ఆయన చూరగొన్నారు.
ఆయన ఇప్పటి వరకు పలు వ్యాసాలు, గ్రంథాలు రాశారు. అనే సభల్లో ప్రసంగాలు చేశారు. ఆయన ఎన్ని రాసినా, ఎంత చెప్పినా ఆయన వద్ద నుంచి వినాల్సింది, చదవాల్సింది చాలానే ఉంటుంది. ఆయన అనుభవాలే పాఠ్యగ్రంథాలు. అవి భావితరాలకు మార్గదర్శకాలు కూడా. విద్యారంగంలో సంస్కరణల గురించి ఆయన చెప్పేవి పాలకులకు పట్టకపోవచ్చు గానీ ప్రజలు వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది.

విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ మన విద్యారంగంలో రావాల్సిన మార్పులేమిటో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చెబుతుంటారు. విద్యార్థులకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా భవిష్యత్తు విషయంలో భరోసాను ఇచ్చే మార్గదర్శనం చేస్తుంటారు.
వన్ ఇండియా తెలుగుకు ఆయన వారం వారం కాలమ్ రాస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆయన కాలమ్‌ను వన్ ఇండియా తెలుగు పాఠకులకు ప్రత్యేకంగా అందించబోతున్నందుకు సంతోషిస్తున్నాం కూడా.. ఆ కాలమ్ రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారికి కూడా ఇతోధికంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. రేపటి నుంచి, అంటే శుక్రవారం నుంచి ప్రతి వారం ఆయన కాలమ్ చదవండి. మీ ఇభిప్రాయాలు కూడా పంచుకోండి..












Click it and Unblock the Notifications