• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పదిహేను నిమిషాల్లోనే బాంబు తయారీ

By Srinivas
|
Maqbool says IM men can make a bomb in minutes
ఎన్ఐఏ విచారణలో అంతుపట్టని పలు ఆసక్తికర విషయాలను తీవ్రవాదులు వెల్లడిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్ కేవలం పేలుళ్లు మాత్రమే కాకుండా భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు దొంగ నోట్ల చలామణిని కూడా చేస్తున్నట్లుగా రెండు రోజుల క్రితం మక్బూల్ వెల్లడించిన విషయం తెలిసిందే. దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కోసం రూ.10 లక్షలు అందడం, అవి కూడా నకిలీ కరెన్సీ చలామణీలో వచ్చిన లాభమని చెప్పాడు.

తాజాగా మరో విషయాన్ని మక్బూల్ బయట పెట్టాడట. తాను బాంబును పదిహేను నిమిషాల్లోనే తయారు చేయగలనని, ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన వారిలో చాలామంది ఈ బాంబును నిమిషాల్లో తయారు చేయగల నైపుణ్యం ఉన్న వారేనని ఎన్ఐఏకి చెప్పినట్లుగా తెలుస్తోంది. తనతోపాటు అరెస్టైన ఇమ్రాన్ కరాచీలో ఇండియన్ ముజాహిదీన్‌లో కీలక సభ్యుడు రియాజ్ భత్కల్‌తో తరుచూ ఛాటింగ్ చేసేవాడని చెప్పినట్లుగా సమాచారం.

ఆపరేషన్‌లో పాల్గొన్న వారు దూరంగా అజ్ఞాతంలో ఉంటారని, వాళ్ల రహస్య స్థావరాలు ఎవరికీ తెలియవని, తనను మిగిలిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మెలగనివ్వలేదని మక్బూల్ వివరించాడట. అందరికీ అన్ని విషయాలు తెలియనివ్వరని, తనకు ఇచ్చిన బాధ్యత మేరకు హైదరాబాదులో రెక్కీ నిర్వహించానని చెప్పాడని తెలుస్తోంది. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన వారు చాలా వరకు మారు పేర్లతో ఉంటారని, ఎవరు ఎక్కడ ఉంటారో తనకు తెలియదని చెప్పినట్లుగా సమాచారం.

గత ఆరు నెలలుగా తాను జైలులో ఉన్నానని, తనకు తెలిసిన వివరాలు అన్ని దర్యాఫ్తు సంస్థలకు వెల్లడించినట్లు మక్బూల్ ఎన్ఐఏకు చెప్పారని తెలుస్తోంది. మరోవైపు, జంట పేలుళ్లకు పథకం వేసిన ఉగ్రవాదులు అక్కడితో ఆగకుండా ఢిల్లీ, పూణే తరహాలో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో ఆరు ప్రాంతాలను వారు ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం.

ట్యాంకుబండు, రాణిగంజ్, బేగంబజార్, ఆబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయం, జనరల్ పోస్టాఫీస్, అన్నపూర్ణ లేన్‌లలో రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మొత్తం పన్నెండు ప్రాంతాల్లో వారు రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాగా, విచారణ నిమిత్తం హైదరాబాద్ తరలించిన మక్బూల్, ఇమ్రాన్‌లను ఎన్ఐఏ అధికారులు ఈ రోజు భారీ భద్రత మధ్య ఢిల్లీకి తరలిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Syed Maqbool, the alleged Indian Mujahideen operative who is being interrogated by the National Investigation Agency in connection with the Dilsukhnagar bomb blasts, told his interrogators that making a bomb was easy. “Bomb tayyar karneka pandrah minute kaam hai (it takes 15 minutes to prepare a bomb).”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more