భీతావహం: తమిళులకు లంక టార్చర్, వింటే గుండె చివుక్కుమనాల్సిందే!..

Subscribe to Oneindia Telugu
  లంక టార్చర్ తో తమిళుల ఆవేదన, మరీ అంత ఘోరంగానా ? | Oneindia Telugu

  బ్రిటన్: శ్రీలంకలో అంతర్గత యుద్ధం ముగిసి ఎనిమిదేళ్లయిందన్నది కేవలం బయటి ప్రపంచాన్ని నమ్మించడానికేనా?.. ఈ ఏడాది జులై వరకు ఆ దాష్టికం కొనసాగిందని బాధితులు చెబుతుంటే ఇంకా శ్రీలంక మాటలను నమ్మాలా?...

  శ్రీలంక దారుణాలకు బలైపోయి ప్రస్తుతం యూరోప్‌లో తలదాచుకుంటున్న 50మంది తమిళులు తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. వారికి జరిగిన అన్యాయాన్ని వెలికితీసేందుకు కొంతమంది మానవ హక్కుల నిపుణులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. బాధితులు వెల్లడించిన వివరాలు విని మానవ హక్కుల సంఘాలు లంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

   లైంగిక టార్చర్

  లైంగిక టార్చర్

  21రోజుల పాటు తనను చీకటి గదిలో బంధించారని, ఆ సమయంలో 12సార్లు రేప్ చేశారని ఓ బాధితుడు వాపోయాడు. అంతేకాదు, సిగరెట్స్ తో ఒళ్లంతా కాల్చారని, తలకిందులుగా వేలాడదీసి ఐరన్ రాడ్స్ తో చితకబాదారని చెప్పాడు. శ్రీలంక సైన్యం తమను ఇళ్ల మీదకు వచ్చి మరీ అపహరించుకుపోయిందని చాలామంది తమిళ పురుషులు ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ టైగర్స్ తో పనిచేస్తున్నామన్న ఆరోపణలతోనే తమపై ఈ దాష్టికాలు జరిగినట్టు పేర్కొన్నారు.

   ఇనుప కడ్డీలతో 'పులి చారికల్లా' వాతలు:

  ఇనుప కడ్డీలతో 'పులి చారికల్లా' వాతలు:

  తమ కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లేవారని.. ఆపై చీకటి గదుల్లో బంధించి చిత్రహింసలకు పాల్పడేవారని చెప్పుకొచ్చారు. దాదాపు సైన్యం అపహరించిన ప్రతీ తమిళ పురుషుడి శరీరం మీద ఇనుప కడ్డీలతో పులి చారికల మాదిరి వాతలను పెట్టడం గమనార్హం. ఈ విషయాలను వెలుగులోకి తెచ్చిన వార్తా సంస్థ దాదాపు 20మంది బాధితులతో మాట్లాడింది. అలాగే 32మంది మానసిక మరియు మెడికల్ కండిషన్ ను అంచనావేసింది. 2016 ఆరంభం నుంచి ఈ ఏడాది జులై వరకు శ్రీలంక సైన్యం తమ దాష్టికాన్ని కొనసాగించినట్టు గుర్తించింది.

  ఖండించిన లంక సైన్యం:

  ఖండించిన లంక సైన్యం:

  లంక సైన్యం మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తోంది. లంక లెఫ్టినెంట్ జనరల్ మహేష్ సేననాయకే మాట్లాడుతూ.. 'లంక సైన్యం గానీ, పోలీసులు గానీ ఎటువంటి దాష్టికాలకు పాల్పడలేదు. ఆ అవసరం కూడా మాకిప్పుడు లేదు' అంటూ చెప్పుకొచ్చారు. బాధితులు మాత్రం తమను లైంగిక వేధించడమే గాక ఇనుప కంచె చుట్టిన కర్రలతో చితకబాదేవారని ఆవేదన చెందుతూ చెబుతున్నారు. మరోవైపు తమిళుల ఆరోపణలపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకుంటామని శ్రీలంక విదేశాంగ శాఖాధికారి తెలిపారు.

   మానహ హక్కుల నిపుణులు:

  మానహ హక్కుల నిపుణులు:

  శ్రీలంకలో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలన్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. లంక బయటికి చెబుతున్నది ఒకటి.. లోపల చేస్తున్నది మరొకటి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  దక్షిణాఫ్రికాకు చెందిన పియర్స్ పిగ్యు అనే మానవ హక్కుల ప్రతినిధి లంక దాష్టికాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గత 40ఏళ్లుగా బాధితుల పక్షాన తన గొంతుకను వినిపిస్తున్నారు. 'లంకలో లైంగిక వేధింపుల ఘటనలు తారాస్థాయికి చేరుకున్నాయి. లంక అధికారులు అత్యంత పాశవికమైన, కనీసం విలువలేని వైఖరిని అవలంభిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చారు.

   తలపై కారం కుమ్మరించి

  తలపై కారం కుమ్మరించి

  తమిళ టైగర్స్ సభ్యుడైన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం యుద్దం ముగిశాక తిరిగి ఇంటికి వచ్చాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. ఇంతలోనే తమిళ సైన్యం అతన్ని అపహరించుకుపోయింది. ఇనుపకడ్డీలు కాల్చి అతని వీపంతా వాతలు పెట్టింది.

  తమిళ టైగర్స్ కు చెందినవాడిగా గుర్తించేందుకు చారికల్లా వాతలు పెట్టారు. దారుణంగా హింసించారు. సంచిలో కారం వేసి దానిని తన తలపై గుమ్మరించి నరకం చూపించారు. ఈ దాష్టికాలను నుంచి తప్పించుకునేందుకు ఒక్కో తమిళ బాధిత కుటుంబం 5లక్షల శ్రీలంక రూపీలను లంచంగా ఇవ్వాల్సి వచ్చేదని చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tamil men seeking asylum in Europe claim they were abducted, raped and tortured by government forces in Sri Lanka.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి