అదరగొడుతున్న నాగార్జున గేమ్ షో (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా కింగ్ నాగార్జున ఆతిథ్యంతో మా టీవీలో ప్రారంభమైన విశిష్టమైన గేమ్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు మూడు వారాలుగా విజయదుందుభి మోగిస్తోంది. నాలుగో వారంలో తెలుగు చానెల్స్ అన్నింటిలో అత్యధిక రేటింగ్ సాధించి నెంబర్ వన్ షోగా నిలిచినట్లు నిర్వాహకులు చెప్పుకున్నారు.
జూన్ 9వ తేదీన ప్రారంభమై ప్రతివారం సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 9 గంటల నుంచి గం.10.30 నిమిషాల వరకు ఈ షో ప్రసారమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాదును కూడా కలుపుకుని 1.22 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.
టామ్ మానిటరింగ్ ప్రకారం 1.74 టెలివిజన్ వ్యూయింగ్ యూనివర్స్ ఆధారంగా భారతదేశం మొత్తం మీద 1.61 వ్యూయర్‌షిప్‌ను సాధించింది. జులై 10వ తేదీన విడుదలైన తాజా టామ్ డేటా ప్రకారం మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగు రోజులు కలిసి ఆరు గంటల్లో సిఎస్ ఎబిసి 4+ ప్రేక్షకుల్లో 7.79 టివిఆర్‌లు సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో వీక్లీ షోల్లో అత్యధిక రేటింగ్ సాధించి రికార్డు సృష్టించింది.

మీలో ఎవరు కోటీశ్వరుడు
మీలో ఎవరు కోటీశ్వరుడు గతవారం ప్రసారమైన నాలుగు ఎపిసోడ్స్‌కు సిఎస్ ఎబిసి 4+ ప్రేక్షకుల కేటిగిరీలో 7.26, 7.24, 7.04, 7.79 రేటింగ్స్ వచ్చాయి.

మీలో ఎవరు కోటీశ్వరుడు
మీలో ఎవరు కోటీశ్వరుడు గతవారం 125జిఆర్‌పిలు సాధించింది. గతవారం తెలుగు టెలివిజన్‌లో ఐదు టాప్ ప్రోగ్రామ్స్‌లో నాలుగు స్థానాల్లో ఈ ప్రోగ్రామ్ ఉంది.

మీలో ఎవరు కోటీశ్వరుడు
సిఎన్ ఫిమేల్ 15-44 ఎబిసి ప్రేక్షకుల్లో నాలుగు వారాల్లో ఈ షో 9.48, 10.05, 9.94, 10.47 టివిఆర్ సాధించింది.

మీలో ఎవరు కోటీశ్వరుడు
నాలుగు వారాల్లో వివిధ కెటగిరీల ప్రేక్షకుల్లో అద్భుతమైన రీచ్‌ను సాధించింది. సిఎస్ 4+ ప్రేక్షకుల్లో 70 శాతం, సిఎస్ ఎబిసి 15+ ప్రేక్షకుల్లో 73 శాతం, సిఎస్ మేల్ ఎబిసి 15 - 44లో 74 శాతం, సిఎస్ ఫిమేల్ ఎబిసి 15+లో 75 శాతం, సిఎస్ మేల్ ఎబిసి 15+లో 81 శాతం రీచ్‌లో తెలుగు టెలివిజన్ కొత్త రికార్డులు నెలకొల్పింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications