వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ వర్సెస్ గద్దర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kcr- Gaddar
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు వర్సెస్ గా మారనుందని అనుకుంటున్నారు. అదేం కాదని గద్దర్ అంటున్నప్పటికీ కెసిఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు శ్రీకారం చుట్టాయనేది నిజం. కెసిఆర్ ను బహిరంగంగా విమర్శించిన నాయకులు ఈ ఫ్రంట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కెసిఆర్ పై ఎంతగా వ్యతిరేకత లేదని చెబుతున్నా గద్దర్ దాన్ని దాచి పెట్టుకోలేకపోయారు. అర్థాంతరంగా పళ్లరసం తీసుకుని ఆమరణ నిరాహారదీక్షను విరమించడానికి ప్రయత్నించడాన్ని తాను వ్యతిరేకించినప్పుడు తనను ఫుట్ పోతోడని కెసిఆర్ వ్యాఖ్యానించారని, విప్లవోద్యమం నుంచి వచ్చాను కాబట్టి తాను ఆ వ్యాఖ్యకు బాధపడలేదని, అయితే తన అభిమానులు బాధపడ్డారని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. దీన్ని బట్టి కెసిఆర్ పై గద్దర్ కున్న వ్యతిరేకత ఏమిటో అర్థమవుతోంది.

అలాగే, కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తలపెట్టిన కోటి బతుకమ్మల జాతరను గద్దర్ తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రజా సంఘాలు కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ కోసం దాదాపు 400 మంది ఆత్మాహుతి చేసుకున్న విషాద సందర్భంలో ఉత్సవం నిర్వహించడం సరి కాదని ఆ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ శక్తులు కూడా గద్దర్ వెంట ఉన్నాయి. కెసిఆర్ వ్యవహార శైలి పట్ల, ఉద్యమాన్ని నడుపుతున్న తీరు పట్ల తెలంగాణలో అనుమానాలు, అపోహలు చాలానే ఉన్నాయి. విమర్శలు కూడా ఉన్నాయి. కానీ, ప్రస్తుత తరుణంలో తెలంగాణ ఉద్యమం చీలిక దిశగా సాగకూడదనే ఉద్దేశంతో కెసిఅర్ కు ఆ శక్తులు కూడా మద్దతు తెలుపుతున్నాయి. రాజకీయ శక్తులు మాత్రం ఆయనకు విరుగుడు కనిపెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. ఈ శక్తుల్లో కూడా వ్యక్తులు ప్రధానంగా మారారు.

కెసిఆర్ పై గద్దర్ పైచేయి స్థాయి సాధిస్తారా, లేదా అనేది చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఈ కెసిఆర్, గద్గర్ పోరులో తెలంగాణ ఉద్యమానికి నష్టం జరుగుతుందనేది గత అనుభవాలను బట్టి సులభంగానే అర్థం చేసుకోవచ్చు. నిజానికి, గద్గర్ తెలంగాణ ఉద్యమంలో నాయకత్వ పాత్రను పదేళ్ల కింద స్వీకరించాల్సి ఉండింది. ఆయనపై ఎప్పటికప్పుడు ఒత్తిడి వస్తున్నప్పటికీ ముందుకు రాలేదు. ఆయన రాజకీయ ఎజెండా వేరు కావడమే అందుకు కారమమని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విప్లవ రాజకీయాల వెంట ఉన్నారు. పార్లమెంటరీ రాజకీయాలకు, ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలనే కట్టడితో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి వెనకాడారని చెప్పవచ్చు.

భౌగోళిక తెలంగాణ కాకుండా ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు ఇంతకు ముందు సంఘాలు ముందుకు వచ్చాయి. అదో డిమాండ్ కెసిఆర్ ఉద్యమానికి సమాంతరంగా సాగుతూనే ఉంది. దళితుల నాయకత్వం రావాలనే ఎజెంజా కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తన చేతుల్లో పెట్టుకుని కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తామని ప్రకటించారు. దాంతో ఇప్పటి నుంచే దళిత నాయకుల పోటీ కూడా ఒకటి పెరిగింది. దీంట్లో గద్దర్ ఉంటాడని చెప్పలేం గానీ మొత్తం ఉద్యమమే దళితుల నాయకత్వంలో సాగాలనేది వారి ఉద్దేశం. అందుకు అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ, గద్దర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఎజెండాను మొదటి నుంచి తెంపు లేకుండా మోసిన సందర్భాలు తక్కువ. మధ్య మధ్యలో వస్తూ ఆ తర్వాత వెనక్కి తగ్గుతున్నారు. ఇది ఆయనకు ప్రతికూలాంశమే అవుతుంది. కెసిఆర్ కు వ్యతిరేకంగానే ఆయన ముందుకు వస్తారనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. తెలంగాణ రాజకీయ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి గద్దర్ ఈ ప్రతికూలాంశాలను అధిగమించాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X