వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా హజారేతో వైయస్ జగన్‌కు పోలికా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Anna Hazare
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వింత వాదనను ముందుకు తెస్తున్నారు. తనకు వ్యతిరేకమైనవారిపై కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెసు పూనుకుంటోందని, అందులో భాగంగానే జగన్‌పై సిబిఐ కేసులు ముందుకు వచ్చాయని వారంటున్నారు. ఇంత వరకు వారి వాదనలోని పసను అంగీకరించడానికి వీలుంది. అయితే, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అన్నా హజారేను అరెస్టు చేశారని, కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి వ్యతిరేకంగా పనిచేస్తుండడం వల్లనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, అందులో భాగంగానే సిబిఐ దర్యాప్తు వేగంగా జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు, గట్టు రామచంద్ర రావు వంటివారు వాదిస్తున్నారు.

తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా సహించదనే విషయం అందరికీ తెలుసు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారే భారతదేశం మొత్తాన్ని కదిలించారు. ఆయన పోరాటంలో న్యాయం, ప్రజల ఆకాంక్ష ఇమిడి ఉన్నాయి. అన్నా హజారేపై కూడా అవినీతి ఆరోపణలు చేయడానికి కాంగ్రెసు పార్టీ నాయకత్వం ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అన్నా హజారే అవినీతికి పాల్పడినట్లు ఏ మాత్రం ఆధారం దొరికినా కాంగ్రెసు వదిలిపెట్టే అవకాశం లేదనేది దాన్ని బట్టే అర్థమవుతోంది. మంచీచెడుల ప్రసక్తి అక్కడ రాదు. కానీ జగన్ కేసు వ్యవహారం పూర్తిగా భిన్నమైంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్సార్ ప్రజలకు మేలు చేశాడనే అభిప్రాయం చాలా మందికి ఉండవచ్చు. పేద ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేశారనే ఆదరణ ఉండవచ్చు. కానీ, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ పెద్ద యెత్తున అవినీతికి పాల్పడి ఆస్తులను కూడగట్టుకున్నారనేది ప్రధాన ఆరోపణ. కేవలం ఆరేళ్ల కాలంలో ఆయన ఆస్తులు లక్షల నుంచి కోట్లకు పెరిగాయి. ఇప్పుడు జగన్ దేశంలోనే అత్యంత సంపన్నుడైన పార్లమెంటు సభ్యుడు. ఇంత పెద్ద యెత్తున సంపదను జగన్ ఎలా సంపాదించడానేది దేశప్రజలందరికీ ఆశ్చర్యమే.

ప్రస్తుతం మంత్రిగా ఉన్న పి. శంకరరావును కాంగ్రెసు పార్టీ పావుగా వాడుకుని ఉండవచ్చు గాక, కానీ జగన్ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు ఆభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశం మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తోంది. జగన్ గానీ, ఆయన అనుచరులు గానీ ఏమీ తప్పు చేయలేదని పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు సిబిఐ విచారణను ఆహ్వానించడమే ఉత్తమమైన మార్గం. దాన్ని అంగీకరిస్తే నిజమైన ఛాంపియన్‌గా జగన్ నిలబడుతాడు. జగన్ ఆవినీతికి పాల్పడలేదని రుజువైతే అన్నా హజారేతో పోల్చుకున్నా, మరెవరితో పోల్చుకున్నా అభినందించేవారు తప్పకుండా ఉంటారు.

English summary
It is very astonishing that YSR Congress leaders are comparing YS Jagan with Anna Hazare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X