ఆదిలోనే హంసపాదు: జగన్ వర్గంలో లుకలుకలు?

జగన్ చుట్టూ ఉన్న కోటరీతో విసిగెత్తిన కొందరు పార్టీలో జగన్‌కు సన్నిహింతగా మెలిగే వారి వద్ద పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత జిల్లాలోనే జగన్‌కు సన్నిహితంగా ఉంటూ జగన్ వర్గీయులమని ముద్ర వేయించుకున్న శాసనసభ్యులు సైతం తమ రాజకీయ భవిశ్యత్తుపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం బద్వేలు నియోజకవర్గంనుంచి ప్రాతినిద్యం వహిస్తున్న కమలమ్మ ఇప్పటికీ జగన్‌కు శిబిరానికి గుడ్‌బై చేప్పేశారు. కాంగ్రెస్‌ను వదిలేదని విస్ఫష్టంగా ప్రకటించారు. జగన్ శిబిరంలోకి అతిదగ్గరగా వెళ్ళిన బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా వెనక్కి వచ్చేశారు. జగన్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే తాను జగన్ శిబిరానికి దూరంగా జరిగినట్టు చెప్పారు. సొంతగూడు ప్రజారాజ్యం పార్టీలోకి తిరిగి వచ్చిన రామిరెడ్డి తన రాజకీయ యాత్ర చిరంజీవితోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఇదివరకటి కంటే మరంత క్రియాశీలకం అవుతున్నారు.
ఇటీవల జరిగిన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అడ్‌హక్ కమిటీల ప్రకటన తర్వాత పార్టీలో అప్పటిదాక ఎంతో చురుగ్గావున్న కొందరు నేతలు కూడా స్తబ్దతగా ఉంటున్నట్లుగా సమాచారం. తమకు ఇది వరకటి ప్రాధన్యతను తగ్గించారని కొందరు నాయకులు లోలోపల రగిలిపోతున్నారు. పార్టీ ప్లీనరి సమావేశాల్లో తమ బాధలను జగన్ ముందు కుండబద్దలు కొట్టేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. మరోవేపు పార్టీ విద్యార్ధి విభాగాన్ని మధ్యలోనే రద్దు చేయటం పట్ల విద్యార్ది విబాగం నాయకుల్లో కూడా అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. కార్పొరేట్ సంస్థల నుంచి వసూళ్ళకు పాల్పడుతున్నారన్న ముద్రవేసి ఏకంగా విద్యార్దులను అవమానించారన్న అభిప్రాయంవారిలో బలంగా నాటుకున్నట్లు తెలుస్తోంది
ఓ సమయంలో ఏకంగా జగన్‌కు మొదటి నుండి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న అంబటి రాంబాబు కూడా అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అవి అబద్దం అని చెప్పడానికి ఆయన వెంటనే సమావేశానికి హాజరయ్యారు. హీరో రాజశేఖర్, జీవిత దంపతులు దూరమవుతున్నట్లు ప్రకటించారు. తన సభలలో రోజా ప్రముఖంగా కనిపించడంతో రోజాను కూడా జగన్ పక్కకు పెట్టినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమె జగన్ వెంట కనిపించింది. కొండా సురేఖ దంపతులు అసంతృప్తి కారణంగానే నాటి పిసిసి చీఫ్ డిఎస్‌తో మంతనాలు జరిపారని కూడా వార్తలు వచ్చాయి. అయితే జగన్ ఈ ప్లీనరీలో తెలంగాణపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి వారు జగన్‌తో ఉంటారో లేదో తేలిపోతుంది.












Click it and Unblock the Notifications