ఆశలన్నీ చంద్రబాబు ప్రచారం మీదనే...

నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు లోకసభ నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి విజయానికి కృషి చేస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటన పార్టీ కార్యకర్తల్లో ఊపు తెస్తుందని జిల్లా నాయకులు చెబుతున్నారు. రోడ్ షోలు నిర్వహించడంతో పాటు చంద్రబాబు కార్యకర్తల సమావేశాల్లో కూడా పాల్గొంటారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాలు చేస్తారు.
చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన నెల్లూరు లోకసభ స్థానంలో తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రచారం ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ప్రారంభమవుతుంది. ఇది నెల్లూరు లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. నర్రవాడ, వింజమూరు, దత్తలూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఆ మర్నాడు ప్రచారం సాగిస్తారు. నర్రవాడలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. శాసనసభా స్థానాల్లో కూడా పర్యటిస్తారు. మే 17వ తేదీ వరకు ఆయన నెల్లూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం సాగిస్తారు.
నెల్లూరు లోకసభ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున తాజా మాజీ లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు అభ్యర్థిగా టి. సుబ్బిరామిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరిని ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి అంత సులభమేమీ కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications