సోము వీర్రాజు వెనక ఉన్నదెవరు: చంద్రబాబుతో కటీఫ్?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయమనం పాటిస్తున్నా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా సోము వీర్రాజుకు మరో నేత మాధవ్ తోడయ్యారు.

  AP ప్రాజెక్టులను కేంద్రం ఎందుకు పెండింగ్‌లో పెడుతుంది ?

  సోము వీర్రాజు వ్యూహాత్మకంగానే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నట్లు అర్థమవుతోంది. పోలవరం, అమరావతి నిర్మాణాలు దైవ నిర్ణయం మీద ఆధాపడుతాయనే చంద్రబాబు మాటలపై మాధవ్ తీవ్రంగా మండిపడ్డారు.

  వీర్రాజు వ్యాఖ్యలు ఆషామాషీ కాదు..

  వీర్రాజు వ్యాఖ్యలు ఆషామాషీ కాదు..

  వెనక బలమైన శక్తి లేకుపోతే వీర్రాజు చంద్రబాబు ప్రభుత్వంపై అంతగా విరుచుకుపడరని అంటున్నారు. దాంతో వీర్రాజు వ్యాఖ్యలను ఆయన తేలిగ్గా తీసుకోవడం లేదు. వీర్రాజు వెనక బలమైన శక్తి ఏదో ఉందని అనుకుంటున్నారు. దాని గురించి ఆరా తీసేందుకే వీర్రాజుపై ప్రతి దాడి చేసిన తమ పార్టీ నేత రాజేంద్ర ప్రసాద్‌ను చంద్రబాబు కోపగించుకున్నట్లు చెబుతున్నారు.

  ఇరు పార్టీల మధ్య బలహీనపడుతున్న సంబంధాలు..

  ఇరు పార్టీల మధ్య బలహీనపడుతున్న సంబంధాలు..

  తెలుగుదేశం, బిజెపి మధ్య సంబంధాలు బలహీనపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు సూచనతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుదాడికి దిగడం లేదు గానీ లోలోన తీవ్రంగా మండిపడుతున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో వారి మధ్య స్నేహబంధం బెడిసేకొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.

  గుజరాత్ విజయం తర్వాత...

  గుజరాత్ విజయం తర్వాత...

  గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే సోము వీర్రాజు చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడిని ఆయన కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లో 99 సీట్లు గెలుచుకుని బిజెపి అధికారాన్ని నిలుపుకుంది. ఈ విజయం తర్వాత విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ సోము వీర్రాజు కూడా డప్పు వాయించారు. కార్యకర్తలతో కలిసి నృత్యంచేశారు. పొత్తు వద్దని చంద్రబాబుతో చెప్పండని ఈ సందర్భంగానే సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

  చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా..

  చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా..

  సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు ఆదేశించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు మౌనం వహించారు. అయినా వీర్రాజు ఆగలేదు. సోము వీర్రాజు తన విమర్శల దాడిని కొనసాగిస్తుండడంతో తెలుగుదేశం నాయకత్వం ఆలోచనలో పడింది. సోము వీర్రాజు వెనక ఆర్ఎస్ఎస్ ఉందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల వెనక సంఘ్ పరివార్ హస్తం ఉండవచ్చునని భావిస్తున్నారు.

  సంఘ్ పరివార్‌కు ఇష్టం లేదు..

  సంఘ్ పరివార్‌కు ఇష్టం లేదు..

  చంద్రబాబుతో పొత్తు సంఘ్ పరివార్‌కు ఇష్టం లేదనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. సోము వీర్రాజు వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా బిజెపి ఎంపి హరిబాబు చెప్పినప్పటికీ చంద్రబాబు అంత తేలిగ్గా తీసుకోవడం లేదని అంటున్నారు. సోము వీర్రాజు వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ బిజెపి అగ్రనాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లిందని అంటున్నారు. దీంతో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోము వీర్రాజు వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

  సంఘ్ పరివార్ వల్ల కష్టమే..

  సంఘ్ పరివార్ వల్ల కష్టమే..


  సోము వీర్రాజు వ్యాఖ్యల వెనక సంఘ్ పరివార్ ఉండడంతో బిజెపితో తమ తెలుగుదేశం పార్టీ పొత్తు కొనసాగడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా కాలం ముందే చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన బిజెపిలో కొనసాగినప్పటికీ నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. అయితే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత చంద్రబాబుతో తెగదెంపులు చేసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన మళ్లీ మొగ్గ తొడిగినట్లు భావిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Sangh Parivar is working in Andhra Pradesh with MLC Somu Veerraju to break alliance with Nara Chandrababu Naidu's Telugu Desam Party (TDP).

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి