పవన్ ఫ్యాన్స్ లో సునామీ!

Pawan Kalyan
చిరంజీవి కాంగ్రెస్ పార్టీని ఘాటుగా విమర్శించలేకపోతున్నారని భావించే పవన్ కల్యాణ్ నిన్న కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడ్డారని ఆంతరంగికులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నాయకుల మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో, కాంగ్రెస్ నాయకులు పవన్ మీద చేసిన ఆరోపణలు పవన్ అభిమానులకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ మంత్రులు యువజన కాంగ్రెస్ నాయకులను పవన్ మీదికి ఎగదోశారు.

ఎప్పుడూ అభిమానుల సహాయం తీసుకోని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఫ్యాన్స్ సహకారం తీసుకోక తప్పని పరిస్ధితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాసే ఒక టీవీ చానల్ వారు పవన్ ఉదంతంపై హీరో రాజశేఖర్, జీవితలతో లైవ్ షో నిర్వహించింది. పవన్ పై రాజశేఖర్, జీవిత ఈ కార్యక్రమం ద్వారా నిప్పులు చెరిగారు. "ప్రజారాజ్యమా? రౌడీ రాజ్యమా?" అని రాజశేఖర్ నిలదీశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రజారాజ్యం సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం సమర్ధించారు.

పవన్ అభిమానులకు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన అభిమానులను యువరాజ్యం కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+