మరో వందకోట్లకు 'సూరి' టెండర్!

కానీ ఒక ఆంగ్లపత్రిక కథనం ప్రకారం సూర్యనారాయణ ఆస్తులు దాదాపు 250 కోట్లు. ఆయనకు విద్యాశాఖ సివిల్ కాంట్రాక్టు ఒక్క రోజు వ్యవధిలో మిస్ అయింది. ఆ కాంట్రాక్టు విలువ అక్షరాలా వందకోట్లు. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ పేరుతో బినామీ ఖాతాలు తెరవడంలో ఆయనకు బ్యాంకు అధికారులు బాగా సహకరించారు. డిసెంబర్ 12 న ఎసిబి అధికారులు ఆయనను అరెస్టు చేయకుండా ఉంటే ఆ వంద కోట్ల కాంట్రాక్టు ఈ "ఎలుగుబంటి"కి దక్కేది.
ఫిషరీస్ శాఖలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఇంచార్జి అయిన సూర్యనారాయణ ఇతర ప్రభుత్వ శాఖల్లోని సివిల్ ఇంజినీరింగ్ పనులను తన విభాగం ద్వారా జరిపించేవాడు. పనులన్నీ నాసిరకమే. కాంట్రాక్టర్లకు తానే పెట్టుబడి పెట్టి వడ్డీతో పాటు కమిషన్లు తీసుకునేవాడు. ఇటువంటి వ్యక్తి మీద నాలుగున్నరేళ్ళుగా చర్యలు తీసుకోకుండా ఇప్పుడు కళ్ళు తెరచిన ప్రభుత్వం ప్రజల దృష్టిలో తీవ్రంగా అప్రదిష్టపాలైంది.












Click it and Unblock the Notifications