జగన్ లైలా తుపాన్!

YS Jagan
జగన్ ఎఫెక్ట్ ప్రభుత్వంపై లైలా తుపాను కంటే తీవ్రంగా ఉంది. రోశయ్య ఫిర్యాదుల మేరకు జగన్ పై దృష్టి సారించిన అధిష్టానవర్గానికి అనేక వాస్తవాలు కళ్ళ ముందు కదులుతున్నాయి. శేఖర్ కమ్ముల సినిమా "లీడర్" ను కూడా చూసి కాంగ్రెసు హై కమాండ్ వైయస్ కుటుంబ సంపదను అంచనా వేసుకుని ఆశ్చర్యపడుతున్నట్టు సమాచారం. అయితే డాక్టర్ వైయస్ సంపాదించిన మొత్తాల సమాచారం జగన్ వద్ద పూర్తిగా లేదని, అదంతా కొందరు రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్ల వద్దనే ఉందని తెలుస్తోంది. ఐదున్నరేళ్ళ కాలంలో వైయస్ దాదాపు 50 వేల కోట్లు సంపాదించినట్టు, ఆ మొత్తాన్ని ఇతర దేశాల్లోనూ, కార్పొరేట్ సంస్ధల్లోనూ మదుపుగా పెట్టినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జగన్ భయానికి శేఖర్ కమ్ముల మాట మార్చారు. నిజానికి ఆయన సినిమా అవినీతి రహిత రాజకీయాల గురించి. 20 వేల కోట్లు సంపాందించి, ఆకస్మికంగా మరణించిన ముఖ్యమంత్రి గురించి. ఆ సొమ్మును ప్రజలకు దారాదత్తం చేయడం గురించి. మరి జగన్ అలా చేయగలరా? వైయస్ ఫైనాన్షియల్ సలహా దారులు ఈ బాలుడిని అలా చేయనివ్వగలరా? తమ కుటుంబం అవినీతి గురించి సినిమా తీసినందుకు జగన్ మనుషులు శేఖర్ కమ్ములకు లెఫ్ట్ అండ్ రైట్ తీసినట్టు సమాచారం. ఆ దెబ్బతో కమ్ముల తన ఉద్దేశం అది కాదని చెప్పుకుంటూ ఇప్పుడు కాలక్షేపం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+