నారా లోకేష్ ఎంట్రీకి బాబు ప్లాన్

లోకేష్ దీక్ష ప్రారంభించే విషయంలో ఆ తర్వాత చంద్రబాబు వెనక్కి తగ్గారని అంటున్నారు. రైతు సమస్యలపై తనకు చిత్తశుద్ధి లేదని, తనయుడి రాజకీయాల్లోకి తెచ్చి పార్టీ పగ్గాలు అప్పగించడానికే దీక్ష పేర నాటకం ఆడుతున్నారని విమర్శలు వస్తాయని సందేహించి చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు వినికిడి. రైతుల సమస్యలపై తాను చేపట్టిన దీక్షలో నిజాయితీ లేదనే విమర్శలు రాకూడదనే అప్పటికప్పుడు లోకేష్ దీక్ష చేపట్టాలనే తొలి వ్యూహాన్ని మార్చేసుకున్నట్లు చెబుతారు. చంద్రబాబు దీక్ష సందర్భంగా నారా లోకేష్ చురుగ్గా వ్యవహరించిన విషయం అందరూ గమనించే ఉంటారు.












Click it and Unblock the Notifications