జూ ఎన్టీఆర్‌ను చంద్రబాబు వదిలేసినట్లే?

జూనియర్ ఎన్టీఆర్ తనంత తానుగా వస్తే కాదనేది లేదని, బుజ్జగించి తీసుకు రావాల్సిన అవసరం లేదని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తన సోదరుడు నందమూరి హరికృష్ణను బుజ్జగించడానికి, ఆయనకు నచ్చజెప్పడానికి బాలకృష్ణ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత ప్రదర్శించకూడదని బాలకృష్ణ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడం తమకు కలిసి వచ్చిందనే ఉద్దేశంతో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా భావిస్తున్నారని అంటున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు అభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, దానివల్ల జూనియర్ ఎన్టీఆర్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందని అంటున్నారు.
కొడాలి నాని పార్టీ మారడం వెనక తన ప్రమేయం ఏమీ లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఆయనపై ఉందని అంటున్నారు. ఆ మధ్య విజయవాడలో తలపెట్టిన ఓ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరుకు కారణం కూడా అదేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. నందమూరి కుటుంబ సభ్యులతో ఉంటేనే జూనియర్ ఎన్టీఆర్‌కు తగిన పలుకుబడి, ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు వ్యూహం పారినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications