జగన్ జైలుకెళ్తారని వైయస్‌కు ముందే తెలుసా?

 YSR know about Jagan's jail?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళతాడని ఆయన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ముందే తెలుసని కథనాలు వచ్చాయి. అక్రమాస్తుల కేసులో గత మే 27వ తేదిన సిబిఐ జగన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన రెండు నెలలకు పైగా జైలులోనే ఉన్నారు. అయితే జగన్ జైలుకు వెళతారని దివంగత వైయస్‌కు ముందే తెలుసట.

వైయస్ బతికుండగా ఓసారి జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఓ జ్యోతిష్కుడు ఆయనకు చెప్పారట. అప్పటి నుండి వైయస్‌కు తనయుడి ఆందోళన పట్టుకుందట. ఈ విషయం తెలిసినప్పటి నుండి వైయస్ తన కొడుకు జగన్ జైలుకు వెళ్లకుండా ఉండాలని భగవంతుడిని ప్రార్థించేవారట. అయితే జగన్ జైలుకు వెళ్తారనే విషయం వైయస్‌కు ఓ జ్యోతిష్కుడు చెప్పడం, ఆయన ఆందోళన చెందడం అనే కథనంలో నిజమెంతో అబద్దమెంతో కానీ ఇప్పుడు మాత్రం యువనేత ఊచలు మాత్రం లెక్కిస్తుండటం గమనార్హం.

జగతి పబ్లికేషన్స్‌తో సహా పలు జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు అక్రమంగా వచ్చాయనే ఆరోపణల నేపథ్యంలో సిబిఐ అతనిని అరెస్టు చేసింది. దీనిపై సిబిఐ దాదాపు సంవత్సరం నుండి విచారణ జరుపుతోంది. ఈ కేసులో జగన్‌తో సహా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌లను అరెస్టు చేశారు. మూడు ఛార్జీషీట్లను కోర్టుకు సిబిఐ సమర్పించింది. మరో పది ఛార్జీషీట్లు దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+