లింగమార్పిడి: అబ్బాయిగా పుట్టి.. అమ్మాయిగా...
వాషింగ్టన్: చూసేందుకు అమ్మాయి, అబ్బాయిలా కనిపిస్తున్న ఓ ఇద్దరు... పుట్టుకతో కవల అబ్బాయిలుగా పుట్టారు. జోనాస్, వ్యాట్ అనే వీరిద్దరిని అమెరికాలోని ఒక మధ్య తరగతి దంపతులు పుట్టగానే 1997లో దత్తత తీసుకున్నారు.
పిల్లలు ఇద్దరు రెండేళ్ల వరకు అబ్బాయిల్లాగానే పెరిగారు. కానీ ఆ తర్వాత మాత్రం మార్పు ప్రారంభమైంది. క్రమంగా వ్యాట్ తాను అబ్బాయిని కాదని, అమ్మాయిని అని భావించాడు. జోనాస్ కార్లు, బస్సుల బొమ్మలతో ఆటుకుంటే వ్యాట్ మాత్రం రాకుమారి బొమ్మలతో ఆడుకునేవాడు.

జోనాస్ మగ పిల్లల దుస్తులు ధరిస్తే, వ్యాట్ ఆడబిల్లల దుస్తులు ధరించేవాడు. తాను పూర్తిగా ఎప్పుడు ఆడపిల్లలా మారుతానని తల్లిని నిత్యం అడిగేవాడు. తల్లిదండ్రులకు మొదట్లో ఇది విచిత్రంగా అనిపించింది. ఆ తర్వాత వారు క్రమంగా అర్థం చేసుకున్నారు.
అతడిని మార్చడం సాధ్యం కాదని భావించి, అతడి మనసును గుర్తించి నడుచుకున్నారు. ఇంటా బయటా అతడికి అండగా నిలిచారు. ఐదో తరగతి చదివే సమయంలో వ్యాట్ పేరును నికోల్‌గా మార్చారు. జోనాస్ కూడా తన సోదరుడికి అన్ని సందర్భాల్లోను అండగా నిలిచాడు. ప్రస్తుతం ఇద్దరు కళాశాలలో చేరారు. దానికి ముందే నికోల్ (వ్యాట్) లింగమార్పిడి చికిత్స చేయించుకుంది.












Click it and Unblock the Notifications