వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత నోట్లు కానుకగా ఇవ్వొద్దు ప్లీజ్: పెళ్లి పత్రికలో వినతి!

దయచేసి రద్దు అయిన రూ.500, రూ.1000 నోట్లను నగదు బహుమానంగా ఇవ్వవద్దు' అని. ఈ విన్నపాన్ని ఏకంగా కూతురి వివాహ ఆహ్వాన పత్రికలోనే ముద్రించడం కొసమెరుపు. ఈ విచిత్ర ఘటన దేశరాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత 9రోజులుగా పెద్ద నోట్ల రద్దు సామాన్య ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతుందో తెలిసిందే. కాగా, సామాన్యులు వేడుకలు జరుపుకోవాలంటూ పెద్ద నోట్ల రద్దు పెద్ద సమస్యగానే మారింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఓ తండ్రి తన కూతురు వివాహం సందర్భంగా చేసిన విన్నపం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అదేంటంటే.. 'దయచేసి రద్దు అయిన రూ.500, రూ.1000 నోట్లను నగదు బహుమానంగా ఇవ్వవద్దు' అనే ఈ విన్నపాన్ని ఏకంగా కూతురి వివాహ ఆహ్వాన పత్రికలోనే ముద్రించడం కొసమెరుపు. ఈ విచిత్ర ఘటన దేశరాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని షాలిమార్ గార్డెన్ కు చెందిన జుగల్ కిషోర్ అనే వ్యక్తి తన 24 ఏళ్ల కూతురు సిమ్రాన్ వివాహం కోసం ఇప్పటికే రూ.3లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేశారు. పెద్ద నోట్ల రద్దుతో వివాహ ఖర్చులను కూడా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

No old currency please, Ghaziabad man adds note to daughter’s wedding card

తాను ముందు 500 మందిని పెళ్లికి పిలుద్దామని అనుకున్నానని, అందుకు అనుగుణంగానే శుభలేఖలు ముద్రణకు ఆర్డరు ఇచ్చినట్లు తెలిపాడు. కానీ, నోట్ల రద్దు వల్ల చేతిలో డబ్బు లేక 200 మంది అతిధులకు తగ్గించుకున్నట్లు కిషోర్ చెప్పారు. అందుకే తాను పెళ్లి పత్రికపై దయచేసి కొత్త నోట్లు ఇవ్వాలని, అసలు ఇవ్వక పోయినా పరవాలేదని పేర్కొన్నట్లు తెలిపారు.

ఈ మేర తన వినతిని పెళ్లికార్డుపై స్టిక్కర్ అతికించానని కిషోర్ వివరించారు. పెళ్లికుమార్తె సిమ్రాన్ కూడా నోట్ల కొరత వల్ల తక్కువ ధర గల లెహంగా తీసుకున్నానని, బంగారు నగల స్థానంలో గిల్టునగలు ధరించానని చెప్పుకొచ్చారు. తాను చిన్నప్పటినుంచి ఇంట్లో దాచుకున్న డబ్బాలో రూ.7వేలున్నాయని అవే ప్రస్థుత తన ఖర్చులకు ఉపయోగపడ్డాయని సిమ్రాన్ తెలిపారు.

కాగా, తాను బ్యాంకు నుంచి రూ. 35వేలు డ్రా చేసి, మిగతా కొంత డబ్బును స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నానని కిషోర్ వివరించారు. ప్రధాని మోడీ పాతనోట్ల రద్దు నిర్ణయం తమ కుమార్తె పెళ్లిపైనా ప్రభావం చూపిందని కిషోర్ కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు. కాగా, ఇలా చాలా మంది సామాన్యుల వేడుకలపై నోట్ల రద్దు ప్రభావం పడిందని చెప్పవచ్చు.

English summary
Currency ban forced a desperate dad to add a ‘special note’ to the invitation card for his daughter’s wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X