టీడీపీలోకి జగన్ పార్టీ ఎమ్మెల్యే సోదరుడు!: కారణం ఇదేనా?
ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన మరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కుటుంబ రాజకీయ విభేదాలతో నలుగుతున్న ఆయన అధికార పార్టీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారు. ఆయనే ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి.
ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రాజకీయంగా చురుగ్గా ఉంటున్నా.. అంతర్గతంగా ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, కొంత కాలంగా మధుసూదన్ రెడ్డికి కుటుంబంలో ప్రాధాన్యం తగ్గిందనే వాదనలు ఆ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నాయి.

అందుకు కారణం రాజకీయ, అంతర్గత విషయాల్లో అదే కుటుంబంలోని మరో వ్యక్తి కీలకంగా మారడమేనట. ఈ నేపథ్యంలో కొంత కలత చెందిన మధుసూదన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరాలని భావించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలు మధుసూదన్ రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications