భయమేస్తోందని పారికర్: బీరు తాగుతూ.. దిమ్మతిరిగే షాకిచ్చిన అమ్మాయిలు

Posted By:
Subscribe to Oneindia Telugu

పనాజీ: భారత్‌లో మద్యం సేవించే యువతుల సంఖ్య నానాటికి పెరిగిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవా సీఎం మనోహర్ పారికర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు కూడా బీర్లు తాగడం మొదలు పెట్టారని, వారిని చూస్తుంటే తనకు భయం వేస్తోందన్నారు.

అమ్మాయిల్లో అల్కాహాల్ సేవించే అలవాటు పెరిగిపోయిందని, అది పరిమితి ఎప్పుడో దాటిందన్నారు. బీర్లు ఎగబడి తాగుతున్నారని, అది తనకు ఎంతో భయాన్ని కలిగిస్తోందని పారికర్ అన్నారు. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంటుకు హాజరైన యువతను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

అడ్డుకట్ట పడాలి

పారికర్ ఇంకా మాట్లాడుతూ.. ఈ మాట అమ్మాయిలందర్నీ ఉద్దేశించి తాను అనడం లేదని, ఇక్కడ ఉన్న వాళ్లలోను ఆ అలవాటు లేకపోలేదని వ్యాఖ్యానించారు. గోవాలో గత రెండేళ్లలో మద్యం సేవిస్తున్న అమ్మాయిల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిందని, దీనికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందన్నారు.

డ్రగ్ సంస్కృతిపై ఇలా

గోవాలో మాదక ద్రవ్యాలపై పారికర్ మాట్లాడుతూ.. డ్రగ్ నెట్ వర్క్‌ను అంతమొందించేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. కాలేజీలో డ్రగ్ సంస్కృతి ఎక్కువగా ఉందని తాను భావించడం లేదని, కానీ మొత్తానికి లేదన్న వాదనతో తాను ఏకీభవించనని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

గవర్నమెంట్ జాబ్ అంటే

చట్టంలోని లోపాలతో నిందితులు త్వరగా బయటపడుతున్నారని పారికర్ అన్నారు. అందుకే శిక్షాస్మృతిని సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిరుద్యోగ సమస్యపై స్పందిస్తూ గోవా యువత కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదని, సింపుల్ వర్క్ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. గవర్నమెంట్ జాబ్ అంటే పని ఉండదనే భావనతో ఉన్నారన్నారు.

ఇదీ కారణం

పర్యాటక రాష్ట్రమైన గోవాలో ఆల్కాహాల్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీయుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. దీంతో తరుచూ మద్యం తాగి గొడవలు చేసే ఉదంతాలు ఉన్నాయి. మనోహర్ పారికర్ ఆందోళనకు అది కూడా కారణం అని అంటున్నారు.

పారికర్ వ్యాఖ్యలపై అమ్మాయిల కౌంటర్

కాగా, అమ్మాయిల్లో మందు కొట్టే అలవాటు పెరిగిపోయిందని, బీరును అధికంగా తాగుతున్న అమ్మాయిలను చూస్తుంటే తనకెంతో భయం కలుగుతోందన్న పారికర్ చేసిన వ్యాఖ్యలపై కొంతమంది అమ్మాయిలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్‌గా బీర్లు తాగుతున్నట్లుగా ఉన్న ఫోటోలు పెట్టారు. ఇందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు.

గర్ల్స్ హూ డ్రింక్ బీర్

పలువురు 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్' (#GirlsWhoDrinkBeer) హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ పారికర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అమ్మాయిలు బీరు తాగడాన్ని మాత్రమే చూశానని ఆయన చెబుతున్నారని, ఇక మహిళలు పోర్న్ మూవీస్ చూస్తారని, సిగరెట్లు తాగుతారని ఆయనకు తెలిస్తే నెలల తరబడి నిద్రపోరేమోనని ఒకరు, ప్రధాని మోడీ మహిళను చూసి నవ్వుతారు (వాస్తవానికి ప్రధాని మాట్లాడుతుండగా రేణుకా చౌదరి నవ్వారు), పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారని మరొకరు వ్యాఖ్యానించారు.ఓ అమ్మాయిగా బీరు తాగడం నాకిష్టమని, మరో అమ్మాయి తన తండ్రితో అప్పుడప్పుడు బీర్ తాగుతానని పోస్టులు పెట్టింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The hashtag, GirlsWhoDrinkBeer, trended nationwide on Saturday following Goa CM Manohar Parrikar 's remarks on the subject. Parrikar had said on Friday that girls drinking beer was "a concern."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి