Long Life: పెళ్లి, బీరుపై 105 ఏళ్ల బామ్మ కీలక కామెంట్స్.. లాంగ్ లైఫ్‌ సీక్రెట్స్ రివీల్

Tips for long life: నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. అలా వందేళ్లకు పైగా జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. సరైన ఆహార నియమాలు, ఫిట్నెస్ తో దీర్ఘాయుష్షు పొందడం పెద్ద కష్టమేనీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల 105వ పుట్టినరోజు జరుపుకున్న ఓ బామ్మ తన దీర్ఘాయుష్షు రహస్యాలను పంచుకున్నారు.

ఇంగ్లాండ్‌కు చెందిన కాథలీన్ హెనింగ్స్ అనే బామ్మకు 105 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం తనకు ఇష్టమైన గిన్నిస్ బీర్ అని చెబుతున్నారు. స్నేహితులు మరియు సిబ్బంది మధ్య ఆనందంగా పుట్టినరోజు జరుపుకుంటూ తన దీర్ఘాయుష్షుకు సంబంధించిన రహస్యం గురించి వివరించారు. గిన్నిస్ తాగడం మరియు వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండటమేనని షాకింగ్ విషయం చెప్పారు.

105 years granny revealed secrets of long life

దీర్ఘకాలం జీవించాలంటే కొత్త ట్రెండ్‌ను అనుసరించాలనే అవసరం లేదని సూచించారు. సింప్లిసిటీతో, ఎల్లప్పుడూ ఆనందంగా బతకడం ద్వారా సంతృప్తికరమైన జీవితం గడిపే అవకాశం ఉందన్నారు. చేసే పని పట్ల సంతోషంగా ఉంటే జీవితం అర్థవంతంగా అనిపిస్తుందన్నారు. అందుకోసం ఎక్కువ సమయం కేటాయించడం నాణ్యమైన జీవితానికి ప్రధాన గుర్తు అని తెలిపారు.

ఒక్కరే సంతోష పడకుండా ఇతరులతో కలిసి పంచుకోవడం ద్వారా అది మరింత రెట్టింపు అవుతుందని కాథలీన్ చెబుతారు. చుట్టూ ఉన్న సమాజంలో ఆనందాన్ని వెతుక్కోవాలని, అప్పుడే జీవితం విలువ మరింత మెరుగవుతుందని వెల్లడించారు. అందుకోసం జీవితం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుందన్నారు. సుదీర్ఘ జీవితాన్ని సాధించడం ఒక రేసుగా భావించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+