విస్కీలో కాస్త నిమ్మరసం, రెండు ఐస్‌క్యూబ్స్ కలిపితే సూపర్..
బ్రాందీ, విస్కీ, రమ్, బీరు లాంటి ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ పార్టీల పేరుతో, ఫంక్షన్ల పేరుతో, వారాంతపు సెలవులు అనే పేర్లు చెబుతూ యువత కూడా మద్యం సేవిస్తోంది. వీరిలో మగవారే కాకుండా ఆడవారు కూడా ఉండటం బాధాకరం. రంగు వస్తామని, బరువు తగ్గుతామనే వంకతో మహిళలు జిన్, వైన్, బీరు తాగుతున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి సనాతన భారతీయ సంప్రదాయాన్ని వదిలిపెడుతున్నారంటూ ఆధ్యాత్మికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీరు కలిపితే రుచి తగ్గిద్ది
అయినప్పటికీ రోజురోజుకు మద్యం సేవించడం పెరుగుతుందేకానీ తగ్గడంలేదు. తాగేటప్పుడు ఏమేం కలుపుకోవాలి, ఏది కలుపుకుంటే రుచి పెరుగుతుంది అనే విషయాలే ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిని ఓ సారి పరిశీలిద్దాం. విస్కీలో నీరు కలపడంవల్ల రుచి తగ్గిపోతుంది. మినరల్ వాటర్ ను చాలామంది కలుపుతుంటారు. దీనికి బదులుగా కొన్నిరకాల పదార్థాలను కలిపితే రుచి అదిరిపోతుందంటున్నారు. విస్కీలో రెండు ఐస్ క్యూబ్స్ లేదంటే షోడా కలుపుకుంటే చాలామంది పాత పద్దతి కదా అని పెదవి విరుస్తున్నారు.

టానిక్ నీరు మంచి మిక్సర్
జిన్, టానిక్ నీళ్లవంటివి మార్కెట్ లో దొరుకుతాయి. వీటిని విస్కీకి కలిపితే మంచి మిక్సర్ గా పనిచేస్తుంది. టానిక్ వాటర్, విస్కీ కలిపి తాగితే రుచి అదిరిపోతుంది. ఈ రెండూ కలిపినప్పుడు రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. పొడవాటి గ్లాసులో రెండు షాట్ల విస్కీ పోసుకొని కొద్దిగా నిమ్మరసం కలుపుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే మీకు సరికొత్త రుచి పరిచయం అవుతుంది.
విస్కీలో రెండు ఐస్ క్యూబ్స్ వేసి కూల్ డ్రింక్ తో టాపింగ్ చేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొత్తగా ప్రయత్నించాలనుకునేవారు ఓ పెగ్గు విస్కీలో ఎనర్జీ డ్రింక్ కలిపితే బాగుంటుంది. ఓ పెగ్ విస్కీలో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని అల్లం రసంతో టాపింగ్ చేయాలి. దీనికి నిమ్మరసం కలిపితే కాక్ టెయిల్ అదిరిపోతుంది.












Click it and Unblock the Notifications