Sunshine Vitamin: సన్‌షైన్ విటమిన్ గురించి మీకు తెలుసా..? ఎప్పుడు, ఎలా లభిస్తుందంటే..

Vitamin D: శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తిని అందించడంతో పాటు శరీర పనితీరుకు మద్ధతిస్తాయి. మనకు పలు రకాల విటమిన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా విటమిన్లను శరీరంలోకి పంపిచవచ్చు. అయితే విటమిన్ D ఇతర వాటికి కొంత భిన్నంగా ఉంటుంది.

విటమిన్ D ని సన్‌షైన్ విటమిన్ గా కూడా పిలుస్తారు. శక్తివంతమైన ఎముకలు, రోగనిరోధక వ్యవస్థ మద్దతుతో పాటు శరీర సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ ముఖ్యమైన పోషక పదార్థం కాల్షియం మరియు ఫాస్ఫరస్‌ను శరీరం గ్రహించడంలో సహాయపడుతుంది. ఇవి ఎముకల ఆరోగ్యం మరియు కండరాల పనితీరు కోసం అత్యంత అవసరమైనవి.

All about Vitamin D uses and sources

సూర్యకాంతి విటమిన్ Dకి సహజ మూలం. శరీరానికి సూర్యరశ్మికి తగిలినప్పుడు చర్మం ద్వారా విటమిన్ D ఉత్పత్తి అవుతుంది. చర్మం రకం మరియు భౌగోళిక ప్రదేశం ఆధారంగా వారానికి కొన్ని సార్లు 10-30 నిమిషాల పాటు శరీరం సూర్యకాంతిని సంగ్రహించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ D తగినంత స్థాయిలో ఉంటేనే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థను కూడా పూర్తిగా పనిచేయగలుగుతుంది.

అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎండలో నిలబడటం వల్ల ఉపయోగం ఉండదు సరికదా చర్మం అనారోగ్యం పాలవుతుంది. ఉదయం లేదా సాయంత్రం వేళ UV కిరణాల ప్రభావం తక్కువగా ఉన్న సమయం మంచిదిగా భావించవచ్చు. ఉదయం 8 లోపు లేదా సాయంత్రం 4 తర్వాత సూర్య కాంతి శరీరానికి తగిలేలా ఎండలో గడపవచ్చు. దీంతో దాన్ని శరీరం గ్రహించి విటమిన్ Dని తయారు చేసుకుంటుంది. అలా తయారు చేసుకున్న విటమిన్‌ను పలు అవసరాలకు ఉపయోగించుకుంటుంది.

అంతేకాకుండా పలు ఆహర పదార్థాల్లో కూడా విటమిన్ D సమృద్దిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాల్మన్ మరియు ట్యూనా వంటి కొవ్వు కలిగిన చేపలు, కోడ్ లివర్ ఆయిల్‌లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు పాలు, నారింజ రసం, మరియు సీరియల్స్ వంటి ఫోర్టిఫైడ్ ఆహారాలు కూడా విటమిన్ Dను శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా తగినంత సూర్యరశ్మి లభించని వారికి ఇవి సహాయపడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+