దగ్గు & జలుబుకు చెక్ పెట్టే "అల్లం మురబ్బా".. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..!

అల్లం మురబ్బా.. పేరు కొత్తగా అనిపించినా కానీ తింటే మాత్రం మళ్లీ మళ్లీ తినాలి అనిపించడం మాత్రం పక్కా. ఈ తరం వారికి దీని గురించి పెద్దగా తెలియక పోయినా 80, 90వ దశకంలో జన్మించిన వారికి మాత్రం బాగా తెలుసు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తరచుగా కనిపించే ఈ వంటకంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా అల్లం ప్రధానంగా ఉండడంతో దగ్గు, జలుబు, గొంతునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

సాధారణంగా మురబ్బా అనేది నైరుతి ఆసియా, ఆగ్నేయ ఐరోపాలలో ఎక్కువగా కనిపించే పండు. మొదట్లో వాటితో జామ్ లాంటివి చేసేవారు. అయితే భారతదేశంలో కూడా ఇది పేరొందిన తర్వాత ఉసిరి, మామిడివంటి పండ్లతో చేయడం ప్రారంభించారు. రాను రాను అల్లం కలపడంతో ఇది అల్లం మిఠాయి, జింజర్ క్యాండీ, అల్లం మురబ్బా పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చింది. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ ఇష్టపడే ఈ అల్లం మురబ్బాను ఇంట్లోనే సులభంగా, శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. కేవలం నాలుగు సాధారణ పదార్థాలతో తయారవుతూ.. ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ వంటకం తయారీకి ఏమేం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..

allam-murabba-alias-ginger-candy-making-recipe-in-telugu

కావాల్సిన పదార్థాలు..

అల్లం ముక్కలు - 1 కప్పు

బెల్లం - ½ కప్పు

పంచదార - ½ కప్పు

యాలకుల పొడి - 1 టీ స్పూన్

కొద్దిగా నిమ్మరసం లేదా తేనె - రుచి కోసం

తయారీ విధానం..

  • ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి, పై పొట్టు తీసేయాలి. ఆ తర్వాత చిన్న, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ( అల్లం ఎక్కువగా పాతది కాకుండా, కొద్దిగా మృదువుగా ఉన్నది తీసుకుంటే పేస్ట్ బాగా వస్తుంది)
  • మిక్సీలో పంచదార వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • అదే మిక్సీలో అల్లం ముక్కలు, బెల్లం తురుము, పంచదార పొడి వేసి మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ( ఈ సమయంలో కావాలంటే రుచి కోసం చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు )
  • ఇక పాన్‌లో కొద్దిగా నీరు పోసి.. ఆ పేస్ట్‌ను అందులో వేసి మెల్లగా కలుపుతూ ఉంచాలి. యాలకుల పొడి వేసి, ముదురు పాకం వచ్చేవరకు మరిగించాలి. సాధారణంగా ఇది 15-20 నిమిషాలు పడుతుంది.
  • కొద్దిగా పాకాన్ని నీటిలో వేసి పరీక్షించండి. అది ముద్దలా కట్టుకుంటే, పాకం సిద్ధమైందని అర్ధం.
  • పాకం సిద్ధమైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఒక చల్లని ప్లేట్‌లో చక్కెర పొడి చల్లి, పాకాన్ని వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి.
  • చివరిగా పాకం కొద్దిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకుని, పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచితే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

అల్లం మురబ్బా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

వాంతులు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

శరీరానికి ఉష్ణం ఇవ్వడం ద్వారా చలికాలంలో రక్షణగా ఉంటుంది.

సహజ శక్తిని పెంచే ఈ వంటకం.. బెల్లం, అల్లం కలయికతో రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+