అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. వంటగదిలోనే దివ్యౌషధం!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మన చర్మం తన సహజమైన మెరుపును కోల్పోవడం సాధారణమైపోయింది. ముఖ్యంగా ఎండా కాలంలో సూర్యకిరణాల తాపం, దుమ్ము, ధూళి చర్మాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు మరింత కలవరపెడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను వాడటం కంటే, మన ఇంటి చికెన్‌లో లభించే అల్లం ఒక అద్భుతమైన సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
అల్లంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా దాని సహజమైన కాంతిని తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయి. మరి, అల్లంను ఉపయోగించి మీ చర్మాన్ని ఎలా మృదువుగా, సహజంగా మెరిసేలా చేసుకోవచ్చో చూద్దాం.

సహజమైన మెరుపు కోసం దివ్య ఔషధం
ప్రతిరోజూ మనం ఎదుర్కొనే దుమ్ము, ధూళి, సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా చర్మం తన సహజమైన కాంతిని కోల్పోతుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఈ దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మంచి రక్త ప్రసరణ చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. తద్వారా చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
మొటిమలు, మచ్చలకు చెక్ !
జిడ్డుగల చర్మం ఉన్నవారు తరచుగా మొటిమల సమస్యతో బాధపడుతుంటారు. అల్లం ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం. ఇందులోనే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్‌పై ఉండే హానికరమైన బ్యాక్టీరియాను మాయం చేస్తాయి. ఇది మొటిమల ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా అల్లం చర్మంపై ఉండే మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది, చర్మపు రంగును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
వృద్ధాప్య ఛాయలు మాయం!
వయసు పెరిగే కొద్దీ చర్మం తన స్థితిస్థాపకతను కోల్పోవడం సహజం. దీనివల్ల ముడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు ముఖంపై కనిపిస్తాయి. అల్లంలో ఉండే సహజ సమ్మేళనాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. కొల్లాజెన్ చర్మాన్ని దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అల్లంను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా ఉంచుతుంది, ముడతలు తక్కువగా కనిపిస్తాయి.
సన్ ట్యాన్ నుండి రక్షణ
వేసవి కాలంలో సూర్యుని తీవ్రమైన కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. దీంతో చర్మం కమిలిపోవడం (సన్ ట్యాన్), మంట వంటి సమస్యలు వస్తాయి. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి . సన్‌బర్న్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది.
అల్లంను ఎలా ఉపయోగించాలి?
ఒక టీస్పూన్ అల్లం రసంలో అర టీస్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మానికి తక్షణ కాంతినిస్తుంది. అంతే కాకుండా అల్లం రసం , కలబంద గుజ్జును బాగా కలిపి ముఖానికి రాయాలి. ఇది చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. మరో వైపు ప్రతిరోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల శరీరం నుండి విష పదార్థాలు తొలగిపోతాయి, ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రంగా , ఆరోగ్యంగా ఉంచుతుంది. కొద్దిగా అల్లం పొడిని తేనె , చక్కెరతో కలిపి చర్మానికి సున్నితంగా రుద్దడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి . చర్మం తాజాగా కనిపిస్తుంది.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహా కోసం మీ వైద్య నిపుణుడిని సంప్రదించండి.
-
బీరకాయ పెరుగు పచ్చడి.. ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా! -
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం












Click it and Unblock the Notifications